శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవ చొటుచేసుకుంది. ఈ ఘర్షణలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఇంజనీరింగ్, లా కాలేజ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ స్ట్రీట్ ఫైట్ ను తలపించింది. మంగళవారం అర్ధరాత్రి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బాణాసంచా కాల్చడంతో వివాదం చెలరేగింది. బాణాసంచా కాల్చడంపై లా కళాశాల విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు. యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులు వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో మిగతా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
Cvr telugu news
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా,మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి, మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కొంతమేరకు పొట్ట దశలో ఉండగా ఆచేలు నెలవాలాయి కొంత శాతం కోసి కల్లాలు పై ఉండగా అకాల వర్షానికి వడ్లు మొలకలు వచ్చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట కూడా వివిధ దశల్లో ఉండగా చిన్న మొక్క నుంచి అడుగెత్తు మొక్క వరకు నీట మునిగి మొక్కజొన్న మొక్కలు చనిపోయి కొంత భాగం నేల వాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షానికి మిర్చి చెట్లు సైతం నేలవాలాయి, పత్తి చెట్ల నుండి పత్తి తీసే తరుణంలో పత్తి తడిసి ముద్దయిపోవడంతో లోపలి గింజల సైతం మొలకలు వస్తాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అకాల వర్షం వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది. ఈ సాయంత్రం కాంగ్రెస్ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే వార్తలు వినిపించాయి. గాంధీభవన్ వద్ద కూడా టీడీపీ జెండాలు ఎగిరాయి. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా ‘స్వీయ సంతృప్తి’ పొందుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం అని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకు ఈయన కారణమవుతారా? అని ప్రశ్నించారు. నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని సవాల్ విసిరారు.
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై వర్షపు నీరు చేరింది, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. 21 వేల క్యూసెక్కుల నీటితో కాలంగి నది ప్రమాదకరంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసారు. తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేశారు. నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కూకట్పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్‌కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు. సీపీఎం తొలుత కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 108 చోట్ల పోటిచేసినా.. కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయగా.. ఫలితాల్లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. దళితుల ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటుందని ప్రచారం జరిగినా ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయింది. చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 1.35 శాతం ఓట్లు పోలవగా.. 2018 లో ఓట్ షేర్ 2.07 శాతానికి పెరిగింది. గతంలో ప్రధాన పార్టీల టికెట్ దక్కని అభ్యర్థులు బీఎస్పీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం ఇవేవీ పనిచేయలేదు. ఓట్ షేర్ కూడా 1.40 శాతానికి పడిపోయింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా సుదీర్ఘకాలం గురుకులాల సెక్రటరీగా కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. అయినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు.
తెలంగాణ కొత్త సర్కారు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పాదలు కదుపుతోంది. ఎలాంటి సంశయాలకు తావు లేకుండా సంకేతాలు ఇస్తోంది. సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా అద్భుతమైన విజయాన్ని అందించిన రేవంత్ కు కూడా పార్టీ మరచిపోలేని కానుక ఇచ్చింది. పార్టీని అన్నీ తానై నడిపి విజయతీరాలకు చేర్చిన రేవంత్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.






Total views : 90625