ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి టైటిల్ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బ్యాటర్లలో మెక్ లానింగ్ 23, షెషాలీ వర్మ 44, రాధా 12, అరుంధతి రెడ్డి 10 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. ఆర్సీబీ బౌలర్లలో మోలినెక్స్ 3, శ్రేయాంక పాటిల్ 4, ఆశా శోభనా 2 వికెట్లు తీశారు. అనంతరం 114 పరుగుల మోస్తారు లక్ష్యంతో చేదనకు దిగిన ఆర్సీబీ 19. 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి డబ్ల్యూపీఎల్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన 31 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించింది. రిచా ఘోష్ 17, సోఫియా డివైన్ 32, స్టార్ ఆల్ రౌండర్ అలెస్సా పెర్రీ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ బౌలర్లలో షిఖా పాండే, మిను మనీ చెరో వికెట్ తీశారు.
delhi
లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. లక్ష పూచికత్తు, 15వేల బాండ్ సమర్పించాలని కోర్టు సీఎం కేజ్రీవాల్ కు స్పష్టం చేసింది. కాగా దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టులో ఈడీ సీఎం కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ పిటీషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు ఇవాళ హాజరయ్యారు. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా… అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఏపిలోఅధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఢిల్లీ(Delhi)లో అమిత్‌షాతో గంటకు పైగా చంద్రబాబు , పవన్ చర్చలు కొనసాగాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలు నడిచాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. బీజేపీ హై కమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: వైసీపీ మరో జాబితా విడుదల
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో సార్వత్రిక ఎన్నికలలో పొత్తు విషయమై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ అంశాలతో పాటు రెండో ఉమ్మడి జాబితాలోని అభ్యర్థుల విషయమై కూడా ఇరువురు అధినేతలు కీలక మంతనాలు జరిపారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ లోనే ఉన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వివరాలు………!
ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నేడు పర్యటించనున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లోక్ సభ ఎన్నికల శంఖారావం లో భాగంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి పర్యటన. ఢిల్లీ(Delhi) నుండి బయలు దేరి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాలకు రోడ్డు మార్గం గుండా జాతీయ స్థాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 11గంటల 5 నిమిషాలకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంఖుస్థాపన కార్యక్రమాల అనంతరం అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గోని ప్రసంగించనున్న ప్రధాన మంత్రి. 12 గంటల 15 నిమిషాలకు తిరిగి ప్రధాన మంత్రి హెలికాప్టర్ ద్వారా వెళ్లానున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
PM Modi: ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు…
2వేల మంది పోలీసులు, కమెండోలు. ఎస్పీజీ వలయంలో స్టేడియం, ఏరోడ్రమ్. ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోలీస్ శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 1700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వారిని పది సెక్టార్లుగా విభజించి విధులు కేటాయించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), గ్రేహౌండ్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) వంటి కేంద్ర బలగాలకు చెందిన మరో 300 మందితో రక్షణ కల్పించనున్నారు. మొత్తం 2 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధానితో
సీఎం రేవంత్ రెడ్డి……….!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నరు ఉదయం 8గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 9గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 11.15 గంటల వరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధాని మోదీతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన లో పాల్గొంటారు మధ్యాహ్నం 12గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి వెళ్తానున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ కోరింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపింది. దీంతో ఈరోజు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ ఎత్తున మెఫెడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. షోలాపుర్ వద్ద కుర్కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్ చేశారు. మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్ ఏరియాలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్నారు. వీటి మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 2,200 కోట్లుగా అంచనా వేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
మేడారం జాతర పై ప్రధాని మోదీ ట్విట్టర్
ఫార్మా ప్లాంట్ ఓనర్‌ను అరెస్టు చేశామని,మరో ఇద్దరికి దీంతో సంబంధం ఉంది అని అదనపు పోలీస్ కమిషనర్ తెలిపారు. తమ బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని పోలీస్ కమిషనర్ అన్ఆరు. డ్రగ్స్‌ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ యజమాని, ఈ డ్రగ్ మాఫియా మాస్టర్‌మైండ్ మధ్య సంబంధాలు ఎలా మొదలయ్యాయో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నదాతలు (Farmers) ఢిల్లీ వైపు పాదయాత్ర:
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని కేంద్ర నిఘా సంస్ధలు భావిస్తున్నారు. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ రావడంపై లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని లేఖలో కోరింది. రైతుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించింది. 14 వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 బస్సుల్లో శంభు బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసే అంశంపై తమ డిమాండ్లపై కేంద్రం ప్రకటన చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. భారీగా రైతులు శంభు బార్డర్‌కు చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.by CVR NEWSఅంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 నుంచి 107 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. WTI క్రూడ్ కూడా 101 డాలర్ల మార్కును దాటింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ…
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.by CVR NEWSరైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.by CVR NEWSపబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైతులు ఆందోళన (Farmers Darna):
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన (Farmers Darna) కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లు ప్రధానంగా కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21లో ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరిఖేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్లుగా ఉన్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇవే అంశాలే అజెండాగా కేంద్రంతో రైతులు చర్చలు జరపనున్నారు. మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా -రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి. Read Also..
- భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.by CVR NEWSఅంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 నుంచి 107 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. WTI క్రూడ్ కూడా 101 డాలర్ల మార్కును దాటింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ…
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.by CVR NEWSరైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.by CVR NEWSపబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు మార్చ్ చేపట్టాలని పిలుపునివ్వడంతో పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నుంచి ట్రక్కులు, ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ వైపుగా బయలుదేరారు. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అంతేగాక సింఘు, తిక్రీ, ఘాజీపూర్ బార్డర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై మేకులను బిగించారు. కాగా, కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతు రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.