శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఏప్రిల్ 26 న వార్షిక కుంభోత్సవం దేవస్థానం నిర్వహించనుంది. ఈ నేపద్యంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గాని శుక్రవారం గాని ఏది ముందుగా వస్తే ఆరోజున కుంభోత్సవం నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీ అలానే ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్విక బలిగా కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించారు. దేవస్థానం ఆనవాయితీ ప్రకారం నేడు శుక్రవారం కావడంతో ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం జరిగింది. అయితే మహా శివరాత్రి తర్వాత వచ్చే ప్రతి మంగళ, శుక్రవార రోజుల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించడంతో లోక కల్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. అలానే ఏప్రిల్ 26న అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహిస్తునట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
devotional news
తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam):
తిరుమల తిరుపతి దేవస్థానం..టీటీడీ జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవల లక్కీ డిప్ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు మరిన్ని ఆర్జిత సేవల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు జ్యేష్ఠాభిషేకం ఉత్సవ వికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తిరుమలలో జ్యేష్ఠాభిషేకం జూన్ 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం వృద్ధులు, దివ్యాంగుల కోసం దర్శన టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
ఇది చదవండి: భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10 వరకు 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం పరిపాలన భవనంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు దేవస్థానం అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషి చేయాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లకు సంబందించిన అంశాలను చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీచేశారు. అధికారులందరు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అదేవిధంగా క్షేత్రానికి వారం రోజుల ముందు నుండే కర్ణాటక, మహారాష్ట్ర కన్నడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, పాదయాత్ర మార్గంలో విచ్చేసే కన్నడ భక్తులకు భీమునికొలను కైలాసద్వారం అలానే అటవీ మార్గంలో వేయి లీటర్ల సింటెక్స్ ట్యాంకులు 8 ఏర్పాటు చేయాలని కన్నడ భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా నీటి కోసం ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అలానే క్షేత్రపరిదిలో భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి సెమియనలు ఏర్పాట్లు చేయాలని కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిదిలో పలు సమాచార కేంద్రాలు, కన్నడ భాషలో సూచిక బోర్డ్స్ పెట్టాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లన్ని ఈనెల 29 లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డి గూడ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో అమ్మ వారి టెంపుల్ వరకు కాలినడకన వెళ్లి బోనాలను సమర్పించడం జరిగింది. అనంతరం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అనంతరం మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ… ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని పాడిపంటలను కాపాడడానికి ఈ తల్లి ఉన్నదని ఎన్నో పురాతన కాలం నుంచి ఈ గుడి ఇక్కడ ఉందని కానీ గత మూడు సంవత్సరాల నుంచి కొత్తగా గుడినీ పునర్ నిర్మించామని అప్పటినుంచి ప్రతి సంవత్సరం కల్యాణాన్ని నిర్వహిస్తామని ఈ కళ్యాణం ఇంకా రెండు సంవత్సరాల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విత్తనాలు వేసే సమయంలో ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేస్తామని అలాగే పంట చేతికి వచ్చినప్పుడు కూడా పంట కోయడానికి ముందు ఎల్లమ్మ తల్లికి మొక్కి పంట కోస్తామని ఈ తల్లి దయవల్ల మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు,గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు:
పంచలోహ విగ్రహాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరులో కూర్మ వరదరాజ స్వామి ఆలయ భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను గుర్తించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిగాయి. గర్భాలయంలోని మూల విరాట్ క్రింది భూభాగంలో రెండు అడుగుల ఎత్తున్న విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు గ్రామస్తులు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
రేవంత్ రెడ్డి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇవాళ్టి నుండి యాదాద్రిలో బ్రహోత్సవాలు ప్రారంభం కాగా.. బ్రహ్మోత్సవాల తొలిరోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎం దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, బీఎల్ఆర్ తదితర స్థానిక నేతలు ఉన్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భద్రాద్రికి వెళ్లనున్నారు. అక్కడ భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను లాంఛ్ చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి సిఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజులపాటు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహ వాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. కాగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజుల పాటు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహ వాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. కాగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పదోవరోజైన ఈ రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన ,త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ మాడ వీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
నంద్యాల జిల్లా డోన్ లో కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి తిరుణాల వైభవంగా జరుగుతుంది. ఈ తిరుణాలకు డోన్ మండలం సంబంధించిన గ్రామ ప్రజలందరూ వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యకర్పురాలతో స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కొత్త బుగ్గ రామలింగేశ్వర స్వామి డోన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరి కిషన్ వారి కుటుంబాల్లో నిర్వహిస్తారు. ఈరోజు ఏడు గంటల సమయంలో రామలింగేశ్వర స్వామికి రథోత్సవమును ఊరేగింపు చేస్తారు. ఊరేగింపులో భారీ ఎత్తున జనాలు కలిసి స్వామివారి రామలింగేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవంలోని ప్రజలే ముందుకు లాగుతూ వెలుతారు. ఈ పద్ధతి పూర్వం నుంచి కొనసాగుతుందని ఇక్కడ నిర్వహించే ధర్మకర్త హరి కిషన్ గారు తెలిపారు.
కుప్పంలో వింత జాతర నేటికీ కొనసాగుతోంది. తమిళుల సాంప్రదాయం ప్రకారం మహా శివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశానకొళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు. కుప్పంలోని శ్మశానవాటికలో మట్టితో అతిపెద్ద అంగాళ పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనకం వచ్చిన మహిళలు, యువకులు అంగాళ పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడా దెబ్బలు తింటారు. ఈ కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీపడడం విశేషం.మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న అంగాళ పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతియేటా బెస్త కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్య పురస్కరించుకొని శ్మశానంలో బెస్త కులస్తులు పూజలు చేపట్టారు.
శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలా దేవుని మట్టిబొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగాళ పరమేశ్వరి వేషధారణలో భక్తాదులు పూనకంతో ఊగి పోయారు. అంగాళ పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని శ్మశానం వద్దకు తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా పూజలు చేపట్టారు. అనంతరం అక్కడ ఉన్న సమాధులను తవ్వి, బుర్రలను నోట్లో పెట్టుకొని చెరుకు గడ్డలా కరకరమని నమిలారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎవరికైనా భూత పిశాచి, గాలి, దయ్యాలు పట్టి ఉంటే, ఆలయ పూజారులు కొరడా దెబ్బలతో కొట్టి శ్మశానవాటికలో తరిమి వేస్తారు. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలో చాలా మంది యువకులు, పెద్దలు చేతులు చాపి మరి కొరడా దెబ్బలు పూజారుల చేతుల మీదుగా కొట్టించుకున్నారు. అనంతరం పూజ ముగిసిన తర్వాత భక్తులు అక్కడున్న శ్మశానంలో ఏర్పాటుచేసిన శిలా దేవుని విగ్రహ బొమ్మ మట్టిను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ మట్టిని తమ ఇంటిలో పెట్టుకుంటే దయ్యాలు, భూత, పిశాచులు రావని ఇక్కడ వారి నమ్మకం.





Total views : 223719