విజయవాడ, కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పర్సనల్ రిక్వెస్ట్ వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మీద విష ప్రయోగం చేసినా దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డాను. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
devotional news
విజయవాడ, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్. 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయుల నిర్భంధం. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్భంధించిన పోలీసులు. నిరసన తెలిపి తీరుతామంటున్న ఉపాధ్యాయులు. ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు. లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అరెస్టు.
అనంతపురం, గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు. రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు. సిపిఐ నాయకులను మరియు అంగన్వాడిని వర్కర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున నగరికటకం, ముఖలింగం అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల నడుమ, ముఖ్యంగా ముఖలింగంలో మధుకేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం అని మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలలో “మధుకేశ్వరాలయం” అతి పురాతనమైనది, చారిత్రక ప్రసిద్ధమైనది.
దేవాలయం కథ :
ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యోగాన్ని చూడటానికి గంధర్వ రాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబర కాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి ‘ సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి’ అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్రకళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని అతనిని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి ‘మన వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్నచెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు. మధుకేశ్వరాలయానికి ముందు పెద్ద నంది విగ్రహం ఉంది. గర్భాలయంలో తెల్లని ముఖలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఉన్న అనేక శాసనాలలో అతి ప్రాచీనమైన శాసనం, శిల్ప లక్షణాధారం ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్ధిలో నిర్మాణం జరిగి ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఇతర భక్తుల సంగతి ఎలా ఉన్నా మధుకేశ్వరుడు శబరుల, గిరిజనుల ఆరాధ్యదైవంగా ఇప్పటికీ పూజింపబడుతూండడం శబరుల అవ్యాజభక్తికి నిదర్శనం.
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ. పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ. పత్తిపాడుకు వరుపుల సుబ్బారావును కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన అధికార పార్టీ. ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ దీవెనలు సంపాదించుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్న పర్వత. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది , ఆ బాధ్యతలు ప్రకారం నేను నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నాని అంటున్న కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే ప్రజా దీవెన పేరుతో కార్యక్రమాలు పెడుతున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు.
కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ కాలనీలో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జరగబోవు ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో అత్యధిక మెజార్టీ రావాలని నాయకులకు సూచించారు. అనునిత్యం భగవంతుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరలా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అడగకపోయినా మీ బిడ్డగా ప్రతి సంక్షేమ పథకం మీకు అందే విధంగా చేపడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగు సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70వేల కోట్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే మరలా సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో ఆరు లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణంకు నాలుగు లక్షలతో గుడి దగ్గర మండపం కి నిధులు ఇచ్చారని తెలిపారు. చంద్రమౌళి నగర్ కాలనీకి నిధులు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిగా కోవూరు నియోజకవర్గంలోనే పడుగుపాడు పంచాయతీలో పారిశుద్ధ్య సమస్యలు తాగునీటి సమస్యలు వీధిలైట్లు సమస్యలు ఎలాంటి సమస్యలపై అయినా ప్రజల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. పడుగుపాడు పంచాయతీకి చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 9117499117 కు కాల్ చేసి సమస్యలు తెలపండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ప్రజలు సమస్యలపై ఫోన్ చేస్తే తక్షణమే పంచాయతీ పాలకవర్గం చర్యలుచేపడుతుంది అని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది. పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను లూటీ చేస్తోంది రీసెంట్గా విశాఖలో కోటి రూపాయలు పైబడే బ్లాక్ మనీ దొరకడంతో సోనోవిజన్ అక్రమాలు బయట పడ్డాయి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ల లో కూడా బ్లాక్ మనీ తరలిస్తూ అడ్డంగా బుక్ అయింది.
కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు. గత మూడు రోజుల క్రితం ఆధిపత్య పోరులో కె15 అనే సంవత్సరం నర ఆడ పులి మృతి చెందగా మరో గాయపడ్డ పులి కోసం గాలింపు. తాజాగా మృతి చెందిన కె15 పులి మృతదేహానికి కొంచెం దూరం లోనే మరో ఐదు సంవత్సరల ఎస్9 అనే మొగ పులి మృతదేహం గుర్తింపు. దరిగాం అటవీ ప్రాంతాల్లో టైగర్ ట్రాకర్స్ తో పాటు జిల్లా ఫారెస్ట్ బృందాల గాలింపు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పులుల రక్షణ అధికారి శాంతారాం,డి.ఎఫ్.ఓ నీరజ్ కుమార్ తొబ్రీయాల్, నేడు సంఘటన స్థలానికి విచారణ నిమిత్తం రానున్న కేంద్ర పులుల సంరక్షణ బృందం అధికారులు.