కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు.
drugs
హైదరాబాద్‌లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. కాగా.. 30 మంది కోసం ప్రేమ్ చంద్ డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లతో కలిపి పార్టీ అరెంజ్ చేశాడు.
హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అన్న పేరుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదం నిర్మూలిస్తామన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటోందని కితాబునిచ్చారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానని తెలిపారు. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. తెలంగాణా స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సీపీ వివరించారు. హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్లాలని లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాలను ఆయన హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు.
Read Also..
Read Also..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు. గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం, హేరైన్, కోకైన్, పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు.అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ యూనస్ ఆలియాస్ జక్కరాజు, బోరపట్ల,శ్రీనివాస్ గౌడ్,గ్రామం గుండ్ల,మ్యాచునుర్, నిర్మల్ గౌడ్, గ్రామం కొడకంచి, మణిక్యల రావు, గ్రామం ఇస్సాపూర్
శివశంకర్ గౌడ్, గ్రామం కొడకంచిరాహుల్ రెడ్డి, గ్రామం బిరంగుడ , శ్రీశైలం యాదవ్, గ్రామం గుండ్లమాచునుర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్ పి చెన్నూరు రూపెష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన గంజాయి బ్యాచ్ దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని ఆరోపించారు. మత్తుకు బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందన్నారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసలు కావడం యువగళం పాదయాత్రలో చూశానని చెప్పారు. ఈ క్రమంలో యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ దందాలను కట్టడి చేయాలని గతంలో ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. అయినా ఏపీలో గంజాయి తీవ్రత తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు టీడీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Read Also..
Read Also..




Total views : 223745