ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు. అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు. కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు. జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో బహిరంగంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు. కోడిపందాల బరులపై కన్నెత్తి చూడని పోలీసు అధికారులు.
Eluru
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్ డివో కార్యాలయాన్ని సుమారు 1000 మంది అంగన్వాడి సిబ్బంది ముట్టడించారు. ఏడురోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీ్ర్లను, సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించి ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు. సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ తమ సమస్యలు నెరవేరేవరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు 26 వేల జీతం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవు సౌకర్యం కల్పించి, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సాలకు పెంచాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతంగా చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్. ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్ ఈ ప్రమాదంలో పది మంది కి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషయం క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు ముగ్గురుని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలింపు. సంఘటన స్థలము చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు…
ఏలూరు జిల్లా
పెదవేగి మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి. పదవ తరగతి చదువుతున్న డీ.కమలేష్(14) అనే విద్యార్థి అర్ధరాత్రి స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెట్టుకి టవల్‌తో ఉరివేసుకున్న వైనం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు విద్యార్థి కమలేష్ స్వగ్రామం,భీమడోలు గ్రామం గుర్తించిన అధికారులు.
ఏలూరుజిల్లాలో కార్తీక మాసం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే భక్తుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తులకు ప్రభుత్వ గుర్తింపు లేని సొంతంగా తయారు చేసిన రసీదులిస్తూ అక్రమ దందాకు సిబ్బంది పాల్పడుతున్నారు. ఆలయానికి వస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పూజలు,, అభిషేకాలు హారతుల పేరుతో 20 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయ మాజీ చైర్మన్ వేణుగోపాల్, ఈవో విశ్వేశ్వర రావు , సిబ్బంది కుమ్మక్కై ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిరుపేదలకు డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే జరిగింది మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన మేనిఫెస్టోపై కమిట్ మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు.
Read Also..
Read Also..
నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 2003 కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. అనంతరం నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు.
Read Also..
Read Also..
ఏలూరు జిల్లా..
నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. నూజివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నా సీఎం జగన్. 2003కు ముందు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నజగన్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10, 303 మంది లబ్ధిదారులకు 12,886, ఎకరాల్లో శాశ్వత భూ హక్కు కల్పించనున్న సీఎం జగన్.
జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు..
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.