మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దారుసాలం లో పురాతన పోలీసుస్టేషన్ భవనంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మంగలహాట్ పోలీసులు. పోలీసులు, ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ అఫిస్ స్టాఫ్ మంటలార్పుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారి భవనం కుప్పకూలింది. అక్కడే మంటలార్పుతున్న మంగలహాట్ పోలీసుస్టేషన్ హోమ్ గార్డు కు, ఎలక్ట్రిక్ ఉద్యోగి కి తీవ్ర గాయాలు కావడంతోవారిని మంగలహాట్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన హోంగార్డు రాజు, ఎలక్ట్రిక్ ఉద్యోగి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని పోలీసులు తెలిపారు. పాత భవనం కావడంతో అక్కడే వ్యాపారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిలిండర్ పెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ఆఫీస్ నుండి షార్ట్ సర్క్యూట్ తో నైనా, ఎవరైనా మంట పెట్టడం వల్లనైనా ప్రమాదం జరిగిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగలహాట్ పోలీసులు తెలిపారు.
hyderabad district news
రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సివిఆర్ న్యూస్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు.. మాదాపూర్ లోని ఇమేజ్ క్యాపిటల్ పక్కన ద రామేశ్వరం కేఫ్ చాలా పేరుగాంచిందని ఎమ్మెల్యే అన్నారు. మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ చాలా మంది మన్ననలను పొందుతుందన్నారు. గత కొద్ది రోజుల నుంచి రామేశ్వరం కేఫ్ లో ఉచితంగా టిఫిన్ టి అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ ఇక్కడ కూడా పేరు తెచ్చుకుంటుందని అన్నారు. రామేశ్వరంలో మొదలైన రామేశ్వరం కేఫ్ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనుస్తుందన్నారు. అనేక రాష్ట్రాల ప్రజలు ఉన్న శేరిలింగంపల్లిలోని మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరనుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు… ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బషీర్ బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరుగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను హిందువులందరు విజయవంతం చేయాలని కోరారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాలలో ఉన్న హిందువులు ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది బలిదానాలు చేసిన తరువాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని… హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో హిందువులు అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు TSSPDCL సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. సమ్మర్ రబీ సీజన్లో ఉండే విద్యుత్ డిమాండ్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు. సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటల కోతలు ఉంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు.
భర్త చనిపోయాడని కనికరిచించల్సింది పోయి మరిది, అత్త దారుణంగా చావా బాధారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో చివరకి మీడియాను ఆశ్రయించింది. బాధితురాలు ఫతేనగర్‌లోని పార్థివ బస్తీలో గత కొంత కాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ (వదిన) అని చూడకుండా మరిది (విశాల్) శారీరకంగా లోబరుచుకుందామని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వదిన ససేమీర అనడంతో కక్ష పెంచుకొని తమ తల్లి అయిన అత్తతో తరచూ గొడవ చేయించేవాడు. కొత్త సంవత్సరం మద్యం సేవించి అత్త మరిది ఇద్దరు కలిసి కోడలిని చావబాదారు. అది చూసిన ఇరుగు పొరుగువారు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించిన ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించిన బస్తి వాసులు అందరూ ఏకం అయి ఒంటరిగా మిగిలిన మహిళకు న్యాయం చేయాలని కోరారు.
జవహర్ నగర్ గత మూడు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రు నగర్ కాలనీ లో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా తాసిల్దార్ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిపి కూల్చివేశారు. దీనిపై క్రైస్తవ భక్తులు నెహ్రు నగర్ కాలనీ బస్తి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్, 14 డివిజన్ కార్పొరేటర్ ఆలూరి సంగీత సంఘటన స్థలానికి చేరుకొని తాసిల్దార్ ఆర్ఐ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ప్రార్థన మందిరాన్ని దౌర్జన్యంగా ఏలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం క్రైస్తవుల మనోభావాలను మత విశ్వాసాలను కించపరుస్తూ క్రిస్మస్ పండుగ ముందు ప్రార్థనలు చేసుకోకుండా మందిరాన్ని కూల్చివేయడం హేయమైన చర్యని వారు మండిపడ్డారు. దీనిపైన వెంటనే తాసిల్దార్ క్రైస్తవులకు సమాధానం చెప్పాలని వెంటనే కూల్చిన చోటే చర్చి పునర్నిర్మాణం చేపట్టాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు.
తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫైల్స్ చోరీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు మాయమైనట్టు గుర్తించిన కార్యాలయ వాచ్‌మన్ ఫిర్యాదుతో కల్యాణ్ సహా ఐదగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కల్యాణ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ చాంబర్ ఉంది. గత శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి కీలక పత్రాలతోపాటు హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. కార్యాలయ తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన వాచ్‌మన్ లోపలికి వెళ్లి చూడగా ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను కళ్యాణ్ ఖండించారు.
విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని ఈసీ ఆదేశాల మేరకు.. హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్ సస్పెండ్ చేశారు. సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్లు ఉన్నారు. మంగళవారం ఎన్నికల తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్ ముషీరాబాద్‌లోని.. సంతోష్ ఎలైట్ అపార్ట్మెంట్లో డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది. అక్కడి చేరుకున్న ఎఫ్ఎస్టి బృందాన్ని చూసి స్థానికులు పరారయ్యారు. అక్కడే నిలిపి ఉన్న AP 28 CH 6759 నంబరు గల కారులో 18లక్షలు, చెక్‌బుక్, 2సెల్ఫోన్లను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు, నగదు ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు మాత్రం గుర్తు తెలియని వారివిగా నమోదు చేశారు. సెక్షన్లు కూడా సరైనవి పెట్టలేదు. కాగా ఈ విషయంపై సీపీ సందీప్ శాండిల్యా ఆరా తీయగా.. సదరు కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్, సుధాకర్‌ను అరెస్ట్ చేసినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో ఘటనపై దృష్టి సారించిన ఈసీ.. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ముషీరాబాద్ ఇన్పెక్టర్గా అదే స్టేషన్లో పనిచేసే డీఐ వెంకట్ రెడ్డి నియామిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులిచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీగా ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ డీసీపీ నితిక పంత్ లేదా ట్రాఫిక్ డీసీపీ -2 గా ఉన్న అశోక్ కుమార్, లేదా ట్రాఫిక్ డీసీపీ-3 గా ఉన్న డి శ్రీనివాస్ లను నియమించే అవకాశం ఉందని తెలిపారు. చిక్కడ పల్లి ఏసీపీగా ఎన్నికల కోడ్‌లో బదిలీ కాని అధికారి నియమితులు అవుతారని సీపీ శాండిల్య వెల్లడించారు.
రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు.మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు.
పదేళ్ళలో ఎమ్మెల్యేగా తాను చేసిన పనిని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కూకట్పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని కోరారు. మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, స్థానికుడైన తనకు పరిష్కరించిన, పరిష్కరించాల్సిన సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, బయట నుండి వచ్చిన వారికి నియోజకవర్గం పై అవగాహన కూడా లేదని, ఓటు వేసే ముందు అన్ని విధాలా ఆలోచించి అభివృద్ది, శాంతి భద్రతలతో మతసామరస్యాన్ని కాపాడుతున్న బిఆర్ఎస్ పార్టీ.ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు బోయిన్‌పల్లిలోని కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత భారీ ఎత్తున హాజరై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ గల్లి గల్లి కి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపుతూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు …హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ముల వలె ఇక్కడ నివసిస్తున్నామని.. తిరిగి మళ్ళీ ఇదే ప్రశాంతమైన జీవనం కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేయాలని తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళదామని కోరారు…
Read Also…
Read Also…





Total views : 89859