ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు త్వరలో రీ టెండర్ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైందని.. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముగ్గురు కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫారిన్ వెళితే.. చూసుకోవడానికి తానున్నానని.. బీఆర్ఎస్ కు తానొక్కడినే చాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు. త్వరలో ప్రధానిని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతామని పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.మంచిర్యాల జిల్లా, మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు . 350 మంది పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని , మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని , పర్క్స్‌పై ఇన్ కం టాక్స్…
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 92147