అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డిన్నర్స్ జోరందుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని నోర్‌ఫోక్స్ నేవీ స్థావరంలో మిలటరీ సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు జోబైడెన్ ‘ఫ్రెండ్స్ గివింగ్’ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడే స్వయంగా వడ్డించారు. ఆయన తన సతీమణి జిల్‌తో కలిసి ఆహార కౌంటర్లోకి వచ్చారు. ఈ విందులో బైడెన్ మాష్డ్ పొటాటోను వడ్డించగా జిల్ స్వీట్ పొటాటో కాసెరోల్స్ను అతిథులకు తినిపించారు. ఈ విందుకు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు అయిన ఐసన్ హోవర్, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సిబ్బంది, వారి కుటుంబాలు హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు నౌకలను ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల నేపథ్యంలో మధ్యధరా సముద్రంలో మోహరించారు. ఈ ఆపరేషన్‌కు మీరు వెన్నెముకని మీ కుటుంబ సభ్యులు దీనికి గుండెవంటి వారని బైడెన్ వ్యాఖ్యానించారు. నేడు బైడెన్ 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా జోబైడెన్ రికార్డు సృష్టించారు.
israel
యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు. గాజా నుంచి పాలస్తీనావాసులను బలవంతంగా పంపించకూడదని ఇజ్రాయెల్‌కు బైడెన్ సూచించారు. గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమణలు చేయకూడదని తేల్చి చెప్పారు. ‘ది వాషింగ్టన్ పోస్టు’కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెలీ అతివాదులకు అమెరికా వీసాలను ఇవ్వబోమని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణ పౌరులను ఇబ్బందిపెడుతున్న ఇలాంటి వారిని గుర్తించి, తగిన మూల్యం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌ను బైడెన్ కోరారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఇంకోలా ఉంది. ‘‘పాలస్తీనా అథారిటీకి గాజాను పాలించే సామర్థ్యం లేదు అనీ యావత్ గాజా సైనిక రక్షణ బాధ్యతలను ఇజ్రాయెల్ చూస్తుందన్నారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ఏరియాలో సైన్యం దాడులు, ఇజ్రాయెలీ సెటిలర్ల హింస కారణంగా గత రెండు వారాల్లో 200 మంది పాలస్తీనియన్లు చనిపోయిన నేపథ్యంలో బైడెన్ పై ప్రకటనను విడుదల చేశారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో ఆయన ఇల్లు ధ్వంసమయింది. హమాస్ అధినేతగా హనియేను పలు దేశాలు గుర్తించాయి. దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ స్పందిస్తూ హనియే నివాసం టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమని ఇజ్రాయెల్ సైన్యం, ప్రజలపై టెర్రరిస్టు దాడులకు సంబంధించినన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని, ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని తెలిపింది. అప్పట్లో హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ కు హనియే కుడిభుజంగా ఉన్నారు. 2004లో యాసిన్ హత్యకు గురయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు గెలుపొందింది. హనియే ప్రధానమంత్రి అయ్యారు. 2017లో ఆయన హమాస్ అధినేత అయ్యారు.
Read Also..
Read Also..
ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది. తూర్పు జెరూసెలం, సీరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది. మొత్తం 145 సభ్యల దేశాలు గురువారం ఈ తీర్మానాన్ని ఆమోదించగా 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కెనడా, హంగరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేషన్ ఆఫ్ మైక్రోనేసియా, నౌరూ, అమెరికా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. కాగా, ఇజ్రాయెల్ తీరును ఐక్యరాజ్య సమితిలో భారత్ ఖండించడాన్ని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే స్వాగతించారు. ఐరాసా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. తీర్మానం ఫొటో కూడా ఆయన నెట్టింట పంచుకున్నారు. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. గతనెలలో ఐక్యరాజ్యసమితిలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ భారత్ దూరంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోరుతూ జోర్డాన్ ఈ రిసొల్యూషన్‌ను యూఎస్ ముందుంచింది. అయితే, ఈ తీర్మానంలో ఉగ్రసంస్థ హమాస్ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ తీర్మానానికి 145 దేశాలు అనుకూలంగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలో సిల్క్యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు.
హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. గాజాపై భూతల దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పింది. హమాస్ అంతం చూసి యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నిన్న మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. విజయం సాధించే వరకు యుద్ధం చేస్తామని పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్ర పక్షాలు కూడా కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది. సుమారు 100 ఫైటర్ జెట్స్ తో అటాక్ చేస్తోంది. హమాస్‌కు చెందిన వందలాది టార్గెట్లను ధ్వంసం చేశారు.సుమారు వంద ఫైటర్ జెట్స్తో అటాక్ చేశామని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనన్స్ బ్రిగేడర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఉత్తర భాగాన్ని ఇజ్రాయిల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌కు చెందిన టెంపోను ఇజ్రాయిల్ ఆర్మీ పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వైమానిక దాడితో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హమాస్ తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్ విడుదల చేసింది. కాగా, తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజ వణుకుతోంది. హమాస్ స్తావరాలే లక్ష్యంగా వైమానిక, భూతల దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టింది. సుమారు 250 మంది స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.






Total views : 91042