పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మేత కోటిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు అనీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని ఎన్నికల ముందు చెప్పారు. జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రo విడుదల చేస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్నాము అని దొంగ పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు ఈ రోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారు. మన రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తోలగించారు అని నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
jagan
రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీతాలు పెంచక, సంక్షేమంలోనూ కోత పెట్టి జగన్ సర్కారు అంగన్వాడీలపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానంటూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిరసనలు చేస్తే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని చెప్పారు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతాలిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అంగన్వాడీల జీతాలు ఎందుకు పెంచలేదని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకొర జీతంతో అంగన్వాడీలు బతికేదెలా రాజన్న పాలన అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
Read Also..
Read Also..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సిఏం జగన్ పర్యటించనున్నారు. ఏళ్ల తరబడి కిడ్ని వ్యాదుల భారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల కోసం తలపెట్టిన రెండు కీలక ప్రోజేక్ట్ లు ప్రారంభానికి సిద్దమయ్యాయి. దీనిని సిఏం జగన్ 14 వ తేదిన ప్రారంభించనున్నారు. 14వ తేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి రానున్నారు. అక్కడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు.
మఖరాంపురం గ్రామము నుండి హెలికాప్టర్ లో పలాస చేరుకోని కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని ప్రారంభించనున్నారు జగన్. ఏపీ సర్కార్ కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మందికి ఉపయోగపడేలా 74.24 కోట్లతో కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని నిర్మించింది. వీటితో పాటు APIIC ఆద్వర్యంలో అరవై ఏకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కు, ఆంద్రాయూనివర్శిటి అనుబంద విభాగానికి సిఏం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అక్కడ నుండి పలాసలో రోడ్ షో నిర్వహించి అనంతంరం పలాస రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భహిరంగ సభలో జగన్ పాల్గోనున్నారు.
Read Also…
Read Also…
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు. అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్రెడ్డి కదిలారని మండిపడ్డారు. ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు. కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్కు ఎవరిని ఎక్కడికి మార్చాలి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది.. రాని వారికి, కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని.. ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని, తడిసినధాన్యం, మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు. చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు. స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి, అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి, దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని.. అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి, దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలో ఎర్రగొండపాలెం లో కనీస వేతనమ 26 వేలు పెంచాలంటూ యర్రగొండపాలెం శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వించిన అంగన్వాడీలు టీచర్లు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కనీస వేతనం 14000 వేళ్ళు ఇస్తానన్న హామీ కూడా మర్చిపోయారు అంటు మాకు జీతాలు పెంచండని ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ల, పిల్లలకు అమ్మఒడి పథకం అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రవీంద్ర రెడ్డీ కి వినతి పత్రం అందజేశారు.
ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు. దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ప్రత్యర్థిని. రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అప్పటి కూచినపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యే గా ఎంపికై, మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్ దంపతులను వైసీపీ అధిష్టానం దగ్గరకు తీసుకుంది. స్వయంగా సీఎం జగన్ గత నెల 15 న వారిని పార్టీలోకి సాదరంగా చేర్చుకున్నారు.
అప్పట్లో పిఆర్పీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీ అధిష్టానం రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఈవూరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇంచార్జీ భాద్యతలు అప్పగించారు. ఎంపీ గానే కొనసాగనున్న మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో అతని స్థానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చేందుకు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం అప్పట్లోజోరుగా సాగింది. నేడు ఇంచార్జీ గా ప్రకటించి వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టించింది.
తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్టి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సమావేశం. రాష్ట్ర విభజన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని డా.ఎన్.తులసిరెడ్డి, ఏపీసీసీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్ అన్నారు. మౌళిక సదుపాయాలు, ముడిసరుకు ఉన్నా కడపకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం అమలు కాదని తేల్చారు. మన్నవరం ప్రాజెక్టు ను మూసివేశారని, కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను యూపీఏ ప్రభుత్వం మొదలెట్టినా..వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచిపోయిందని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా కడప – బెంగుళూరు రైల్వే లైన్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాశారని, వైఎస్సార్ సిఎంగా రైల్వే లైన్ క్లియర్ చేయిస్తే కుమారుడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేయించారని అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాజధాని, హైకోర్టు రెండూ అమరావతిలో నిర్మించినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే నష్టపోయేది రాయలసీమ వాసులేనని, కృష్ణానది యాజమాన్యం బోర్డు విశాఖలో పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి యాజమాన్య బోర్డుకు లేఖ రాశారని, రాయలసీమలో కృష్ణానది బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే నష్టపోయేది సీమ వాసులేనని, సీమలో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు డిమాండ్ చేస్తున్నామన్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి, జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 న జిల్లా పర్యటన కు రానున్నారని అందులో భాగంగానే నేడు పోర్టు లో పనులు ఎలా జరుగుతున్నాయో, ఎంత వరకు జరిగాయో పరిశీలనకు వచ్చామన్నారు. గత 40 సంవత్సరాలుగా భావనపాడు పోర్ట్ అని వింటున్నామని, మూలపేట పోర్ట్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి వల్లే సాకారం అయిందని అందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలను నిర్మూలించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. టిడిపి నాయకులు పోర్టు నిర్మాణ పనుల వద్దకు వచ్చి సందర్శించి సెల్ఫీ లు దిగాలని హేళన చేశారు. మార్చి నెలాఖరుకల్లా పోర్టు వద్దకు షిప్పుని తెచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనించాలని ప్రతిపక్షం నాయకుల మాటలు నమ్మవద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ పార్టీ నే అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు, బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను మంత్రి రజిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జగనన్న ప్రభుత్వంలో రైతును రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా జగనన్న అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేని వారి పాలెం గ్రామాల్లో.. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, అరటి పొలాలను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70 నుంచి 80 శాతం వరకు రైతులకు పంట నష్టం జరిగిందని అన్నారు, చేతికి వచ్చిన పంట నేలపాలు అవ్వడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పంట నష్ట సేకరణ త్వరగా సేకరించాలని అధికారులకు సూచించారు, అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అని కేంద్ర ప్రభుత్వాలు కూడా విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవాలి అని… అవసరమైన చట్ట సవరణ కూడా చేయాలి అని అన్నారు… ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్ని, రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు అని… ఇనుమురేషన్ సమయంలో అధికారులు ఉదారంతో ఉండి పంట నష్ట వివరాలు సేకరించాలి అని ఆయన తెలిపారు, రైస్ మిల్లర్లు రైతులను నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దు అని అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ విషయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు.
Read Also…
Read Also…






Total views : 90537