తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుఫాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుఫాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.
jagan
ఏపీలో తుఫాను తీవ్రత ఎక్కువ అవ్వటంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. తుఫాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల గురించి ఆరా తీసారు. అధికాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు.
ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ , మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలనీ,
ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదనీ సీఎం స్పష్టం చేసారు.
పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్‌కు భయం పట్టుకుందని, అసెంబ్లీ ఫలితాలను చూసి ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందు ముందు తన పరిస్థితి ఏమిటోనని ఆయన భయపడుతున్నారన్నారు. అందుకే రాష్ట్రాన్ని తుఫాన్ కమ్మేసినా బయటకు రావడం లేదని విమర్శించారు. ప్రచండ వేగంతో మిగ్జాం తుఫాన్ రాష్ట్రాన్ని కమ్మేస్తోందని, ఈ సమయంలో రైతులు, మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న అభినవ నీరోచక్రవర్తి జగన్ అని దుయ్యబట్టారు. ఆయన అసమర్థత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని, విలాసాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త , అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ గిరీషా పిఎస్ తోపాటు ఉమ్మడి కడప జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మునిసిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా ఇతర వైకాపా నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ జాబ్ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి 100 కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం పొందేందుకు నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ అర్హత ప్రమాణాలతో కూడిన సర్టిఫికెట్స్ తో హాజరయ్యారు. జాబ్ మేళాకు హాజరైన వారికి ఎంపి ఎమ్మేల్యే అద్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిలేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి జడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్, వ్యవసాయ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,తో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బోండా ఉమా, తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పెట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ.. రాష్ర్టంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పదో తారీఖు లోపు ఢిల్లీ నుండి ఒక టీమ్ రాబోతుందన్నారు. 8 మంది జిల్లా కలెక్టర్లపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కలెక్టర్లు జగన్ కనుసన్నల్లో కాకుండా.. ఎన్నికల నిభందనలను పాటించాలని తెలిపారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను, అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు. రెండో రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. ముమ్మిడివరం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. పేదల కడపు నింపేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను మూసివేసి సీఎం జగన్ పైశాచికానందం పొందారని విమర్శించారు. పాదయాత్రలో అన్నా క్యాంటీన్‌ను వార్డు సచివాలయంగా మార్చడని గమనించిన లోకేశ్.. అక్కడే నిలబడి సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాన్ని, ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారని మండిపడ్డారు
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు, మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ…
నా ఎస్సీలు, బిసిలు అంటున్న జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం.
Read Also…
Read Also…
ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220/132/33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని, ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని,ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా,దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు.
నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు, అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు, అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.





Total views : 90520