గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
jagan
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్పై జరిగిన కోడికత్తి దాడి వెనక ఓ పనికిమాలిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ప్రాణాలను రేపోమాపో తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, వైసీపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. తిరుపతిలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయంలోకి కత్తి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న భద్రతాధికారులతో తాను మాట్లాడానని, అప్పుడు కత్తి లేదని, జగన్కు రక్తం కూడా రాలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గాలకు దిగడం సరికాదని హితవు పలికారు. జగన్ తన స్వలాభం కోసం దళితుడైన శ్రీనును ఐదేళ్లుగా జైలులో ఉంచడం దళిత ద్రోహానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనును వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా ప్రజలకు మేలు చేస్తాడని భరించానని అయినా అలా జరగలేదన్నారు. జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరన్నారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని షర్మిల ప్రశ్నించారు.
Read Also..
Read Also..
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోద ముద్రపడింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించారు. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. చట్టం అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సీఎం సెక్యూరిటీ వింగ్ తో పాటు అదనంగా సీఎం భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయస్తున్నట్టు తెలిపారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ముఖ్యమంత్రి, భార్య / భర్త, తల్లిదండ్రులు, పిల్లలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు. సీఎం నివాసం వద్ద, రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడక సమయంలో వారికి భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం జగన్ కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలు ఇద్దరికీ అక్కడ భద్రతను కల్పిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి నుంచి నా రాజీనామా ఆమోదించకుండా.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నా రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని గంటా మండిపడ్డారు. రాజ్యసభలో నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయని మండిపడ్డారు.. నన్ను అడగకుండా రాజీనామాను ఆమోదించారని, కుట్ర కోణంతో వైసీపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ గంటా ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ..బీసీలకు జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు పొడిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని అన్నారు. తాను ప్రభుత్వంపై పొరాడుతుంటే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ హయంలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్చయించుకుందని తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం మామిడిగుంట గ్రామంలో అశ్లీల నృత్య ప్రదర్శనలు. వైసిపి నాయకుల కనుసన్నల్లో ఐదుగురు యువతులతో తెల్లవారు జామున వరకు సాగిన అశ్లీల నృత్యాలు. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో బహిరంగంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగినా ద్రాక్షారామ ఎస్ ఐ ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.






Total views : 91142