జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారీ వర్షాల కారణంగా పెద్ద చెరువు కట్ట తెగిన ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చెరువు కట్ట తెగి మూడు రోజులుగా నీరు బయటకు వెళ్తున్నప్పటికీ పురపాలక, ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో మెట్పల్లి పట్టణానికి తాగునీటి సమస్యతో పాటు మత్స్యకారులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ లేకుండానే మున్సిపల్ అధికారులు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం ఆశ్చర్యకరమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సర్కస్‌ను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. చెరువు కట్టను వెంటనే పటిష్టపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, నష్టపోయిన మత్స్యకారులకు తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Tag: