జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకుని 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని SFI నాయకులు ఆరోపించారు.. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు..
Tag: