కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంటే తెలుగుదేశం ఎందుకు పుట్టేదని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు దేశంలో ఎక్కడాలేని విధంగా వేతనంలో 30 శాతం అలవెన్స్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.
Kcr
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న బీజేపీని గెలిపించాలని అభ్యర్ధించారు. ఇటీవల జరిగిన మాదిగ విశ్వరూప సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటి ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మరి జనార్దన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని అందుకే ప్రజల తరఫునుంచి కారు గుర్తుకే ఓటేస్తామని తనను మూడోసారి గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బ్యాలెట్ లో మూడో నెంబర్ గుర్తుపై నొక్కి తనను గెలిపించాలని బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తన ప్రచారంలో ప్రజలు ఇస్తున్న మద్దతుకు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుండ్లపల్లి టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళికి అనుగుణంగా సీఎం కేసీఆర్ సిబ్బంది కూడా అధికారులకు సహకరించారు.
Read Also..
Read Also..
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మ్యానిఫేస్టోను విడుదల చేసి అందరికంటే ముందున్న కేసీఆర్ ప్రచారంలో కూడా దూసుకువెళుతున్నారు. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటూ మూడోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే మరోసారి కారు పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా మధ్యాహ్నాం నుంచి మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని, ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏండ్లు అయిన ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పోడు పట్టాల పేరుతో సీఎం కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ ఇచ్చారు, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిన ప్రజల స్వప్నం నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు కానీ అలాంటిదేమి జరగలేదని విమర్శలు గుప్పించారు.
Read Also..
Read Also..
బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ, తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ కొత్తగా బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తి బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితపై బండి సంజయ్ తీవ్రంగా విమర్శలు చేసినందుకే జీర్ణించుకోలేకనే తొలగించారని అన్నారు. దేశంలో అబద్దాలు చెప్పే వ్యక్తుల్లో ప్రధాని మోడీ నెంబర్ వన్, కేసీఆర్ నెంబర్ టూ అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదని మరి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆ విషయం చెప్పానని ప్రకటనలు చేస్తూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను దగా చేశారని నారాయణ మండిపడ్డారు. కాంపిటీటివ్ ఎగ్జామ్ పెట్టడంలో, టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడంలో, పేపర్ లీకేజీలు, కోర్టు కేసుల పేరిట ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారు సురేందర్ రెడ్డి.. బజార్లో ఉల్లిగడ్డలు అమ్మినట్టు ఆ పార్టీ టికెట్లు నమ్ముతున్నారని విమర్శించారు. కొత్తగూడెం టికెట్‌ను జలగం వెంకట్రావుకు 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్‌లో లాలు కుటుంబం, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపించారు.
రాష్ట్రంలో దోపిడి… నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దోపిడీ నిరంకుశ పాలన పై పోరాటం చేసి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికలలో రామగుండం అభ్యర్థి రాజ్ ఠాకూర్ ను ఓటేసి గెలిపించాలని కోరారు. మళ్లీ టిఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి ఉండదు… ప్రజలకు ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడమే మన కర్తవ్యం అని పేర్కొన్నారు.
Read Also..
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ ప్రజలు 10 సం. రాల బీఆర్ఎస్ పరి పాలనలో సంతోషంగా ఉన్నారు అని అన్నారు. కెసిఆర్ చేపట్టిన పతకాలు అందరికీ అందుతున్నాయి అని అన్నారు. తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి నీ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జనగామ ప్రజలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం లేదు అందుకే ప్రచారం లో కూడా గూండాలను ఈసుకొని తిరుగుతున్నారు అని అన్నారు. అలాగే నిన్న జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలోని జన సమూహాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటమి బాయం పట్టుకుంది అన్నారు. ఇకపోతే నేను లోకల్ కాదు అని ప్రచారం చేస్తున్నారు నాది ఎక్కడో కాదు తరిగొప్పుల పక్కనే మావురు అని అన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చేది కెసీఆర్ ప్రభుత్వం మే తెలంగాణ ప్రజలు డిసైడ్ ఐ ఉన్నారు అని అన్నారు. జనగామ లో గెలిచేది మేమే జనగామకు కావలసిన పల్టెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ లు జనగామకి అవసరం ఉన్నవి అన్నీ కెసిఆర్ గారిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు.





Total views : 90752