ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు. భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గృహం కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. జగనన్న కాలనీలో అసంపూర్తిగా మొండి గోడలతో నిర్మాణాలు ఉన్నాయని కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆయన అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళల వద్ద నుంచి 35000 వరకు వసూళ్లు చేసిన కాంట్రాక్టర్ పరారయ్యాడని ఆయన ఆరోపించారు. ఏలూరులో నిర్మించిన కిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పక్కనపెట్టి… జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రజలను మళ్ళీ మోసం చేశారని విమర్శించారు.
news
విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట శాసనసభ్యులు పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు తమ గోడును ఎమ్మెల్యే కి విన్నవించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుఫాను సమయంలో ఆ చెరువు క్రింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు మొరపెట్టుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చెప్పారు. అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క పంట నష్టానికి కారణమయిన నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానిక రైతులు రోడ్ పై నిరసన తెలియజేశారు.
Read Also…
Read Also…
ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏలూరు నగర ప్రజలే కాకుండా జిల్లాలోని 40 గ్రామాల నుంచి ప్రతీ రోజూ వైద్య సేవలు కోసం రోగులు వస్తుంటారన్నారు. రోగికి వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఉచితంగానే చేస్తున్నారని తెలిపారు. అయితే గత కొంతకాలం నుండి అవుట్ పేషెంట్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మారై స్కానింగ్ కు 5 వేల రూపాయలు వసూలు చేస్తూ 1500 రూపాయల కమిషన్ను రిఫర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ముట్ట చెబుతున్నారని తెలిపారు. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు పేద రోగుల నుంచి కమిషన్ ద్వారా దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది నుంచి పార్వతీపురం కేంద్రంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పట్టణ పోలీసులు ఛేదించారు. ఐదు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయి పార్వతీపురం పట్టణంలో గల చాకలి వీధికి చెందిన బుక్కురు లక్ష్మణరావు గా గుర్తింపు, సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన దుస్తులు ఆధారంగా ముద్దాయిని పోలీసులు గుర్తించారు. ముద్దాయి నుంచి ఐదు కేసులకు సంబంధించి దాదాపు 9 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ముద్దాయి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also….
Read Also….
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా సబితా ఇంద్రారెడ్డి 3వ సారి భారీ మెజార్టీతో గెలిచారు. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి.. స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది, మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఇది విజయోత్సవ సభ కాదు.. కృతజ్ఞత సభ.. బాధ్యత గా పని చేస్తా…ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా మీతో కలిసి ఉంటా ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట… మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్తా.. మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ ఒక వెలుగు వెలిగింది. అంతులేని అధికార దర్పానికి కేంద్రబిందువుగా ప్రగతి భవన్ కొనసాగింది. ఎమ్మెల్యేలకు సైతం లోపలకు వెళ్లేందుకు కష్టంగా ఉండేది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ తలుపులు సామాన్య ప్రజలకు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. రేవంత్ చెప్పిన విధంగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వద్ద ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ ను తొలగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పైనుంచి వచ్చిన ఆదేశాలతో జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించారు. అంతేకాదు ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలు పరిశీలిస్తారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది. బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది, వర్షపునీరు మురుగునీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శిలా విగ్రహం తలను పగలకొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిరికి పందల చర్య, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నాయకులు నందమూరి తారక రామారావు, సంస్కార లేని వైసిపి మూకలు చేసిన దుశ్చర్య గా భావిస్తున్నాం . కూడు, గూడు, గుడ్డ సామాన్యుడి కి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఎవరేమనుకున్నా సరే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే అల్లరి మూకల ఆటకట్టిస్తాం.
తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు భారీగా రావడంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో కోలాహాల వాతావరణం నెలకొంది.
Read Also…
Read Also…
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత, భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. చైర్మన్ దంపతులకు పార్టీ కండువా కప్పి పార్టీ లో చేర్చుకున్నారు.






Total views : 90594