తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
Priyanka gandhi
తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. రూ. 400 గ్యాస్ సిలిండర్ ధరను రూ. వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు.
Read Also..
Read Also..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు, విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారీంటీలను అమలు చేస్తామని.. తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రియాంక గాంథీ ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ తనను తాను ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించుకుంటారని.. నాయకుడు అనే వారు ప్రజల కోసం ఆలోచించాలి తప్ప సొంతవాళ్ల కోసం కాదన్నారు. ఇక కేసీఆర్ కు సెలవు ఇప్పించి ఫాంహౌస్ కు పంపించే సమయం వచ్చిందన్నారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్ పై సెటైర్ వేసారు.
ఎన్నికల సమయంలో ఎం మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా, ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగిందా, స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడడా, 10 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడ, వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ, ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది. రైతుల రుణమాఫీ చెయ్యలేదు రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ చేసింది ఆదాని కి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడు. రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే, అధాని మాత్రం 16 వందల
కోట్లు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తో మీ ముందుకు వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50, 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8, 9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది. ఓవైసీ ఎప్పుడు రాహుల్ గాంధీ ని నిందిస్తారు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు. బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వల్ల అవినీతి సొమ్మును బయటికి తీసి, ప్రజలకు పంచుతామని, సోనీయామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు. మహాత్మా గాంధీ నుండి ఇప్పటి వరకు మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ప్రజల సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే 6 గ్యారంటీ లు అమలు చేస్తాం. ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, 5 ఎండ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదిక పైన ఎం చేశామో గర్వంగా మాట్లాడుతాను. తెలంగాణ కోసం కొట్లాడింది మీరు, రాష్ట్రం మీది, మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని, ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏండ్లు అయిన ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పోడు పట్టాల పేరుతో సీఎం కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ ఇచ్చారు, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిన ప్రజల స్వప్నం నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు కానీ అలాంటిదేమి జరగలేదని విమర్శలు గుప్పించారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. నేడు ప్రియాంక గాంధీ ఖానాపూర్, అసిఫాబాద్ల పర్యటించనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి నాందేడ్ చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు. ఇక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసిఫాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.
మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి KLR మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి వచ్చి నేను ఇక ముందు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా చెల్లెలు అయిన పారిజాత నర్సింహ రెడ్డి లకు హామీ ఇస్తున్నా వారికి రాహుల్ గాందీ , ప్రియాంక గాంధీ లేదా సోనియా తో మాట్లాడిస్తనని హమీ ఇస్తున్నారు. తప్పకుండా పారిజాత నర్సింహారెడ్డి కి గౌరవ మైన స్థానం కల్పిస్తానని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పోటీ చేసి న తరువాత ఎంపీ కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తానని అన్నారు. నాకు ఎక్కడ ఇల్లు లేదు. కేవలం తుక్కుగుడ లో నే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ గట్టిగా పోటీ చేసి సభితమ్మ ను ఓడించి తీరుతామని ఆ పోరాటం లో పారిజాత నుండి పూర్తి సహకారం అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా నర్సింహ రెడ్డి మరియు పారిజాత గారికి రాత పూర్వకంగా అధిష్టానం నుండి తెలుప్తని అని అన్నారు. మహేశ్వరం నుండి కాంగ్రెస్ అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలు ఏకమై సబితా ఇంద్రారెడ్డి ని ఓడించి తీరుతామని KLR అన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదటగా కొత్త జిల్లా అయిన నారాయణ పేట్ జిల్లాలోని దేవరకద్రకు ప్రియాంక గాంధీ మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడ మహిళలతో సమావేశమై టీపీసీసీ ప్రకటించిన ప్రధాన మేనిఫెస్టో ఆరు గ్యారంటీల ప్రచారం చేయనున్నారు. తర్వాత సాయంత్రం వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా భేరీ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రధానంగా రాష్ట్రం చూపు మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం పైనే ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా భేరీ బహిరంగ సభ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ లో గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరగా..కొన్ని విభేదాల వల్ల జూపల్లి కృష్ణారావు ఈమధ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. . గతంలో రెండు సార్లు వాయిదా పడ్డ ప్రియాంక గాంధీ పర్యటనను ఈసారి విజయవంతం చేయాలని చూస్తుననారు. పాలమూరు ప్రజాభేరి సభలో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి పేరును అధికారింగా ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీ పర్యటించడం ఇది రెండోసారి.





Total views : 90590