ఎన్టీఆర్ జిల్లా, రేపటి దెందులూరు సీఎం సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై పార్టీ నేతల్లో గందరగోళం. మైలవరం కేడర్ ను సీఎం సభకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్న ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గం పరిశీలకుడు పడమట సురేష్ బాబు. ఈ నెల 4 లేదా 5 న ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెబుతానని ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం.
regional news
బిర్యానీ అంటేనే ఫుల్ ఫ్లేవర్! ఆ రుచిలో సగభాగం బిర్యానీ ఆకు నుంచే వస్తుంది. చాలా మంది ఈ ఆకుని వాడి పడేస్తారు. కానీ ఆకుని కాల్చిన పొగ ద్వారా కలిగే లాభాలు చాలానే ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు కాల్చిన పొగ ద్వారా కలిగే లాభాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతారు, మరికొందరు దాని హానికరమైన ప్రభావాల గురించి హెచ్చరిస్తారు.
బిర్యానీ ఆకు పొగ శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలకు ఇది మంచిది. బిర్యానీ ఆకు పొగ కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుందని కూడా నమ్ముతారు. ఇది వాపును తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. బిర్యానీ ఆకు పొగ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు శాంతిని కలిగిస్తుంది. బిర్యానీ ఆకు పొగ నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తుంది మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
NTR జిల్లా, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం. అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు, ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు. అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు, భక్తులు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద దగ్ధమవుతున్న కారు, కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోయినట్లు సమాచారం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ముగ్గురు యువకులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో కారు దిగి పారిపోయిన యువకులు, టాటా హేరియర్ డీజిల్ కారు పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్‌గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.
దానిమ్మ తొక్క(pomegranate peel) లో ఉన్న ఔషధగుణాలు:
దానిమ్మ తొక్కలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఇకపై తొక్కను పడేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇంతకీ దానిమ్మ తొక్కతో కలిగే లాభాలేంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం…
దానిమ్మ తొక్క(pomegranate peel)ను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాస్త నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకొని దాంతో దంతాలను తొముకోవాలి. ఇలా చేస్తే పళ్లు తెల్లగా, దృఢంగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి.
దానిమ్మ తొక్కలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని కషాయంలా తాగాలి దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. మహిళలు. పీరియడ్స్ టైమ్‌లో కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో దానిమ్మపండు తొక్కల్ని ఎండబెట్టి చేసిన పొడిని గ్లాస్ వాటర్‌లో ఓ టేబుల్ స్పూన్ వేసి కలిపి తాగించాలి. అది రక్తం పోకుండా ఆపుతుంది.
పైల్స్ సమస్య వేధిస్తున్న వారు ఎండిపోయిన దానిమ్మ తొక్కల్ని పొడి చేసి అందులో బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోజూ వాడుతూ ఉంటే పైల్స్ సమస్య మటుమాయం అవుతుంది. అలాగే కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దానిమ్మ తొక్కలు అతిసారం సమయంలో రక్తస్రావం ఆపడానికి మరియు జీర్ణక్రియ మెరుగుపరచడానికి,పేగు వాపు తగ్గించడానికి,హెమోర్హోయిడ్స్ యొక్క వాపు,పేగు లైనింగ్ పట్టుకు సహాయపడుతుంది. గొంతులో టాన్సిల్స్ సమస్యలు, గుండె జబ్బులు, శరీరం నుంచి చెడు వాసనలు, దగ్గు, బ్లీడింగ్ వంటి వాటికి దానిమ్మ తొక్కల పొడి బాగా పనిచేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: తొక్కే కదా అని పడేస్తున్నారా..! ఇవి తెలిస్తే షాక్ అవుతారు- యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా? జర జాగ్రత్త…by Prakashయాంటీ బయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ | Antibiotics యాంటీ బయాటిక్స్(Antibiotics) అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు, లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్, పరిశుభ్రత ఉండడం లేదు. ఇవన్నీ…
- పనస పండు.. పోషకాలు మెండు…by Prakashపనస ఆరోగ్యానికి భరోసా(jackfruit)… పనసపండు, దీనిని “జాక్‌ఫ్రూట్”(jackfruit) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా గుర్తించబడుతుంది, ఒక్కో పండు 100 పౌండ్ల బరువు వరకు ఉంటుంది. పనసపండు చాలా పోషకమైనది, దీనిలో ప్రయోజనాలు మనకు తెలియక దూరంగా పెడుతుంటాం.…
- ఈ చిట్కాలతో సన్ స్ట్రోక్ కి బై బై చెప్పండి..by Prakashసన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటే… | Sun Stroke or Heat Stroke బయట ఎండలు మండిపోతున్నాయ్ సన్ స్ట్రోక్ | హీట్ స్ట్రోక్ | వడదెబ్బ పేరు ఏదైనా దెబ్బ మాత్రం ఒక్కటే ! వేసవి…
అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలు నిత్యావసర సరుకులు. ఒక రైస్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది వీఆర్వో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా C I మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని వారి కుమారులు, కుమార్తెలు జాగ్రత్తగా చూసుకోవాలని గ్యాస్ బండ లీక్ అవటంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోయింది గ్యాస్ వాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద వయసు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కుమారులపై ఉందని ప్రతి పేదవాడికి సహాయం అందించే విషయంలో ముందుంటారని ఆపదలో ఉన్నవారికి ఒకరికి ఒకరు సహాయం తీసుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు.