విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కేశినేనికి అదేస్థానం నుంచి వైసీపీ తరుపున పోటీకి రెడీ అని ప్రకటనలు వచ్చాయి! అయితే తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
Tdp
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన తల్లి, చెల్లిని తరిమేసిన దుర్మార్గుడని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టిడిపిలోకి 150 కుటుంబాలు చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. ముందుగా పార్టీలోకి చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను పూలమాలలు గజమాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. జనం ధనం కి మధ్య జరిగే ఎన్నికల్లో జనమే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని వైసీపీ నీరుగార్చిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ కు పతనం తప్పదన్నారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసివ్వడంతో యదేచ్ఛగా సహజ వనరుల దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమితో 165 స్థానాలు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ కరేగౌడ మంజునాథ్ గౌడ్ పాల్గొన్నారు.
కేశినేని నాని లక్ష్యంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి ఫైరయ్యారు. కేశినేని పార్టీలో ఉన్నంతకాలం ఒక విధంగా పార్టీ మారాక ఇంకో విధంగా మాట్లాడుతున్నారని బుద్దా మండిపడ్డారు. నానికి ఎవ్వరి గురించి మాట్లాడే హక్కులేదన్నారు. పార్టీని వీడిన వసంత కృష్ణప్రసాద్ పై అవాకులు చవాకులు పేలొద్దని హెచ్చరించారు. వసంత కుటుంబానికి చరిత్ర వుందని ఆయన తండ్రి హోంమంత్రిగా పనిచేశారన్నారు. కేశినేని నాని మాట్లాడేవన్నీ అబద్దాలేనన్నారు. గద్దె రామ్మోహన్ కు 17వేల ఓట్లు మెజారిటీ వస్తే నానికి కేవలం 12వేలు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. కేశినేని నాని వంటి అబద్దాల కోరు రాకతో. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుప్పం నుండి బరుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తమిళనాడు సరిహద్దు కనమూరు వద్ద ప్రమాదశాత్తు బోల్తా పడింది. తెల్లవారుజామున 5: 30 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ డ్రైవర్ జై కుమార్ మలుపు తిరిగే సమయంలో బస్సు బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు కనకరాజు సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గ మెరుగైన 120 బస్సులను గ్రామాలకు తరలించారన్నారు. అయితే ఈ జగన్ ప్రభుత్వంలో కుప్పం డిపోలో ఉన్న మంచి బస్సులను పుంగునూరుకు మంత్రి పెద్దిరెడ్డి తరలించుకున్నారు. పుంగునూరు డిపోలో ఉన్న డొక్కు బస్సులు ను కుప్పం డిపోకు వేసి ప్రయాణికుల తో చలగాటమాడుతున్నారు. ఇకనైనా మెరుగైన బస్సులను కుప్పం డిపోకు వేయాలని డిమాండ్ చేశారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఆరు మండలాలు ఉండగా అన్ని మండలాలలో టీడీపీ కి మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గం లో ప్రజలు టీడీపీకే అనేక సార్లు పట్టం కట్టారు. 2019 ఎన్నికలో వైసీపీ నుండి ద్వారక నాద రెడ్డి గెలుపొందారు. అయినా నియోజకవర్గంలో అభివ్రుద్ది మాత్రం శూన్యం అంటున్నారు అక్కడి స్థానికులు. ఇప్పటికే వైసీపీ దాదాపు అన్ని ప్రాంతాలకు నియోజకవర్గం ఇన్చార్జిలను ప్రకటించింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోయినప్పటికీ ఆయా ప్రాంతంలోని టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలుపుతూ టీడీపీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే తంబళ్లపల్లె నియోజకవర్గం సంబంధించి రైతు బిడ్డ, ప్రముఖ వ్యాపారవేత్త జయచంద్రారెడ్డి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అక్రమాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటమిలను నిర్ణయించేది మురిసికాపు రెడ్డీస్ మాత్రమే. అలాంటి సామాజిక వర్గానికి చెందిన జయచంద్ర రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చి ఇక్కడి రైతుకు చేయూతనిస్తాము అంటున్నారు. 2024 ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గం ని టీడీపీ ఖాతాలో జయచంద్ర రెడ్డి వేస్తామంటున్నారు.
వైసీపీకి మరో షాక్ తగలనుందని పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని విడనున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు కృష్ణప్రసాద్ దూరంగా ఉండడంతో ఈ ప్రచారనికి మరింత బలం చేకూరింది. ఈ నెల 4న తన భవిషత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు. అయితే టీడీపీ వసంత కృష్ణప్రసాద్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందని మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని మైలవరం నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు. కామాక్షితాయి ఆశీస్సులతో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేసారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అనుమతులు తీస్కుని మరికొందరు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి వందల కోట్లు సంపాదిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి అనేదే లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలను మట్టి ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఈ మట్టి తవ్వకాల వెనుక ఉండటంతో అధికారులేవ్వరు అక్రమ మట్టి తవ్వకాలవైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయడం లేదంటే అధికారులపై ఎలాంటి వొత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ హయాంలో మాజీమంత్రి చినరాజప్ప అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు మట్టి తవ్వకాలు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే తవ్వకాలు చెయ్యాలని అధికారులకు హుక్కుం జారీ చేయడంతో ఇతరులు ఎవ్వరు రామేశం మెట్టలో మట్టి తవ్వకాలు జరిపినా అధికారులతో దాడులు జరిపించి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ద్వారంపూడి అనుచరులు కానీ వారు ఎవ్వరూ రామేశంమెట్టలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మెట్టలొ మట్టి తవ్వకాలు చేసేందుకు ద్వారంపూడి అనుచరులు ప్రయత్నించగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అడ్డుకున్నారు. నా పరిధిలో మట్టి తవ్వకాలు నా ఇష్టం ఇక్కడ తవ్వకాలు జరిపితే మర్యాదగా ఉండదని తెగేసి చెప్పడంతో ద్వారంపూడి చంటిబాబుపై కక్ష పెంచుకున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేటలో చంటిబాబును పక్కన పెట్టి నరసింహం కు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రామేశంమెట్టలో మట్టి తవ్వకాలను పెద్దాపురంకు చెందిన కొందరు అడ్డుకున్నారు. మైనింగ్,రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి 13 టిప్పర్లు, 2ఎక్స్కవేటర్లు సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న ద్వారంపూడి సీజ్ చేశారు కదా ఫైన్ కట్టించుకుని వదిలేయండి అంటూ రుసరుసలాడుతూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడ సీజ్ చేసిన వాహనాలకు అక్కడే ఫైన్ వేసి వదిలేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేనిది పెద్దాపురం వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో ఖంగు తిన్న ద్వారంపూడి ఎలాగైనా మట్టి తవ్వకాలు తానే చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అనుమతులు తీస్కుని తవ్వకాలు చేస్తే ఎలా అడ్డుకుంటారో చూస్తానని తన అనుచరుల వద్ద ద్వారంపూడి అనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మట్టి తవ్వకాలు అడ్డుకోవాల్సిన విపక్ష నేతలు మాత్రం రామేశం మెట్టకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం…
కేశినేని నాని తన పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.. చాలా సందర్భాల్లో నేను పోటీ చేయను అని అనేక మందితో చెప్పారు. చంద్రబాబు పై మీరు చేసే వ్యాఖ్యలకు మీ విజ్ఞతకే వదిలేస్తున్న.. నా విజయం పై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు నేను సమ్మతిస్తున్నాను. నా విజయానికి మీరు కూడా కారణం అనేది నేను ఒప్పుకుంటాను. అదే విధంగా కేశినేని నాని పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో మిగతా 6 గురు టీడీపీ అభ్యర్థులని కూడా గెలిపించుకుంటే బాగుండేది. ఇండిపెండెంట్ గా పోటి చేస్తే 2 లక్షల మెజారిటీ వస్తుంది అని కేశినేని అనుకున్నప్పుడు, ఇండిపెండెంట్ గా పోటి చేసి మీ విశ్వరూపం చూపించవచ్చుగా.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వాళ్లకి ఓట్లు వేయాలని ఎవరు అనుకోవట్లేదు. వైసీపీ తరపున కాకుండా ఇండిపెండెంట్ గా పోటి చేస్తే మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి. కృష్ణలంక రిటైనింగ్ వాల్ గురించి అయిన ఒక్క సారి వాస్తవాలు మాట్లాడండి. ఉల్లిపాయ – బంగాళాదుంప కి తేడా తెలియని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి రక్షణ గోడ గురించి తెలిసే అవకాశమే లేదు. నాలుగు రోజుల్లోనే మాటలు మారుస్తుంటే దాన్ని రాజకీయం అనరు, వ్యభిచారం అంటారు. జగన్మోహన్ రెడ్డి బంగారపు స్పూన్ లో పుట్టారు, అందుకే ఆలుగడ్డ కి ఉల్లిగడ్డ కి తేడా తెలియలేదు.
Read Also..
విజయనగరం జిల్లా, కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.