పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో అరెస్టయ్యిన టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత పనిమీద పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా బీటెక్ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అరెస్టు చేసినట్టు వివరించారు.
Tdp
కడప జిల్లా…
పోలీసుల అదుపులో బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవిని కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన కుటుంబ సభ్యులు. బీటెక్ రవిని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని, తెదేపా శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన. ఏ కేసులో రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు లేని సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీటెక్ రవిని రిమ్స్ కు తరలిస్తున్నట్లు సమాచారం. బీటెక్ రవికి ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పోలీసులదే బాధ్యత అంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి…
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై, నెల్లూరు జిల్లా టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బీసీ లేనని, వారంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సత్తా ఏమిటో చూపాలని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దానికి సంబంధించి బీసీలను సమాయత్తం చేసేందుకు, కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనవర్గాలపై అధిక సంఖ్యలో దాడులు జరిగాయని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. బీసీ లను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని, సామాజిక బస్సుయాత్ర పేరుతో మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నష్టపోని కుటుంబమే లేదని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మాలకొండ దేవస్థానం చైర్మన్ పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు.
ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టీడీపీ బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ… అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
జగన్‌కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు – యనమల రామకృష్ణుడు
ఏపీ సీఎం జగన్‌కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారి మళ్లించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈనెల 15వ తేదీన టిడ్కో గృహాల సముదాయంలో పాలకొల్లు చూడు అనే వినూత్న కార్యక్రమం, బహిరంగ సభ జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులతో కలిసి వంటావార్పు కార్యక్రమం చేపట్టమన్నారు. కాగా పోలీసుల బలగంతో మాకు పోటీ సమావేశం పెట్టాలని వైసీపీ చూడటం అప్రజాస్వామికం, అరాచకం అన్నారు. అయినా భయపడేది లేదు, తిరుగుబాటు మొదలైందని వేలాది ప్రజలతో రేపు సభ నిర్వహిస్తామని చెప్పారు. లబ్దిదారులు సొంత ఇంటికి చేరకముందే వారిని ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణగ్రస్తులను ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే కుట్రతోనే టిడ్కో గృహాలను ప్రభుత్వం పేదలకు అందించడం లేదని విమర్శించారు. ఈకార్యక్లమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సిద్దిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై భేటీలో కమిటీ చర్చించింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఇరు పార్టీ సభ్యులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పించే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపాదించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం ఉందన్నారు. ఆయనకు వయస్సేమీ అయిపోలేదని, మోదీ కంటే ఆయన చిన్నవారే అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తను చేసిన వ్యాఖ్యలు జనంలోకి తఫ్పుగా వెళ్లాయన్నారు. శాంతిభద్రతల విషయంలో తప్పక బాబు అరెస్ట్ నిరసనలు హైదరాబాద్ లో చేయవద్దని…అది పక్క రాష్ట్రం వ్యవహారం అని చెప్పానన్నారు. చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తరుచూ టచ్‌లో ఉంటానన్నారు. చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని తమ మధ్య సోదర భావమే ఉందన్నారు.
కడప జిల్లాలో గత నెలలో YCP నాయకుడు బెనర్జీ పై జరిగిన హత్యాయత్నం కేసులో టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వెళ్లారు. బెనర్జీ హత్యాయత్నం కేసులో సంబంధంలేని నన్ను అరెస్టు చేయడం ఏమిటి అని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు..ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బెనర్జీ అనే వ్యక్తిపై భరత్ రెడ్డి చేసిన దాడి అనుకోకుండా జరిగినది. దాడిలో పాల్గొన్న భరత్ రెడ్డి నా తమ్ముడు, రామ్మోహన్ రెడ్డి నా బంధువు అని, బెనర్జీ ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని భరత్ రెడ్డికి చెప్పుకుందని, ఈ విషయం బెనర్జీ కి తెలిసి అమ్మాయి విషయంలో తలదూర్చకూడదని భరత్ ను పలుమార్లు బెదిరించాడన్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంట టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
అమరావతి….
నేడు జనసేన,టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది, నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు,జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు. టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ, మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి. ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..




Total views : 90721