మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్షణ వైఖరిని నిరసిస్తూ సిఐటియు మరియు మున్సిపల్ గ్రామపంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెండింగు ఉన్నందున ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నటువంటి మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికులకుఅనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జిల్లాలో చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో రెండు నెలల నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్న పరిస్థితి. బకాయిలు వెంటనే చెల్లించాలని సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధికారులను అనేకసార్లు కలెక్టర్ గారికి మరియు మంత్రి సీతక్క కి కూడా అందజేయడం జరిగింది. అయినా ఇప్పటివరకు పెండింగ్ వేతనాల పైన జాప్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సంవత్సరాలుగా గ్రామాలలో సేవలందిస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వారికి ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనిత సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేకపోవడం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించైనా సరే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91050