Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

by Rama
నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని నిర్వహిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ముసలి కన్నీరు కార్చిందని, నిరుద్యోగులకు చేయూత నిస్తామని నేడు మొండి చేయి ఇచ్చిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. గత పది ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని, అందుకే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు గడిచిన నిరుద్యోగుల ఏ ఒక్క సమస్యలను పరిష్కరించలేదని, నిరుద్యోగులకు ప్రతినెల అందిస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేకపోయిందన్నారు. లోగడ రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..ప్రధానంగాగ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గల మెత్తిన బీజేవైఎం నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించడం అమానుషమని, దీన్ని బీజేవైఎం జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ..టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.
    శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్, దాదాపు రూ.80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల…
  • చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.
    చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు . పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు .…
  • సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
    సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…
  • కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.
    రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో…
  • పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.
    దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039106
Total views : 194298

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: