తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనుంది. మొత్తం 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులను దశలవారీగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.
Tag: