ఈనెల 3వ తేదీన ఏలూరు నేషనల్ హైవే పక్కన ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు మూడు లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.. అదేవిధంగా వైజాగ్ నుండి విజయవాడ చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు.. వీటితోపాటు నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.
Traffic
మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, హత్నూర మండలం లో పెట్రోల్ పంపులు వద్ద బారులు తీరిన వాహనదారులు, పెట్రోల్, డిజిల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బస్సులు, ఆటోలు, లారీలు, బైకులు పెట్రోల్ బంకులలో డిజిల్ లేకపోవడంతో ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్లలో డిజిలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నాట్లు వేయడానికి కూలీలను పిలుచుకున్నాం, డీజిల్ కోసం వచ్చేసరికి పంపులలో డిజిల్ లేదని చెప్పడంతో డీజిల్ ఎప్పుడు వస్తుందని చూస్తూ పడిగాపులు కాస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు హిట్ హాండ్ రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వాహనదారులు చేపట్టిన సమ్మెకు గాను, డీజిల్ రాకకు అంతరాయం ఏర్పడడంతో పలుచోట్ల డీజిల్ బంకులు బందు చేశారు, కొన్ని పెట్రోల్ బంకులు డీజిల్ పోయకపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. నర్సాపూర్‌లో ప్రధాన రహదారి గుండా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. డీజిల్ పోయకపోవడంతో బంకుల వద్ద రహదారి పైకి వచ్చి వాహనదారులు ధర్నా చేపట్టడంతో ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.




Total views : 79898