తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
TTD
తిరుపతి, టిటిడి ఉద్యోగుస్తుల 3 దశాబ్దాల ఇంటి స్థలాల కల సాకారం. నేడు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి చేతులు మీదుగా ఇంటి స్థలాల పంపిణీ. చిత్తూరు జిల్లా వడమాల పెట వద్ద 400 ఎకరాల్లో స్థలం కేటాయింపు. అర్హులైన వారందరికీ 50 అంకణాల స్థలం కేటాయింపు. దాదాపు 3 వేల మంది ఉద్యోగస్తులను అర్హులుగా గుర్తించిన టిటిడి. త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు కేటాయించేందుకు టిటిడి చర్యలు.
తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకుని, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టిటిడి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసిందని కొనియాడారు. దర్శనం అనంతరం సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… టిటిడి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కంపార్ట్మెంట్లో కాసేపు వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి కావలసిన పాలు, నీరు, ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు ఇస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని అభినందించారు. భక్తులకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగిస్తున్న కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు ఆ దేవదేవుడు మరింత శక్తి నివ్వాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.
నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి, జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ.. పల్లె నిద్ర చేస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు. పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరిలో సీటు రోజాకు లేకుంటే.. రాధాకృష్ణ నిల్చుంటాడు.. రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు. మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని, జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో.. అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని, ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100% పనిచేస్తాం అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు. ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని,
చంద్రబాబు., పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యాం అని అన్నారు. 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు. నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు.
తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం, సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఓ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి. మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందంగా సంతోషాన్ని నింపుతుంది. చిరుజల్లులు, పొగ మంచు, చలి ఇలా ఊటీని సైతం మించిపోయేలా ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల లో వాతావరణం ఈ విదంగా ఉండడంతో భక్తులు తన్మయంతో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు ఘాట్ రోడ్లలో కూడా పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి అంటు టీటీడీ సూచన చేస్తుంది.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Read Also..
శ్రీవాణి టికెట్ కొని శ్రీవాణి దర్శనం చేసుకున్న తమకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని హైదరాబాద్ కు చెందిన భక్తుడు రవికుమార్ దంపతులు స్పష్టం చేశారు. దర్శనం అనంతరం స్వామి వారిని చూస్తూ వెనక్కు నడుచుకుంటూ తన్మయత్వంలో అక్కడే ఆగిపోయిన సమయంలో అక్కడి సిబ్బంది వేగంగా వెళ్లాలని తమకు గట్టిగా చెప్పారేకానీ అసభ్యంగా ప్రవర్తించలేదని వారు చెప్పారు. ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా వక్రీకరించి టీటీడీ మీద బురద చల్లేలా ప్రచారం చేయడం తమకు బాధ కలిగించిందని వారు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం వారు సెల్ఫీ వీడియో ను విడుదల చేశారు. ఇందులో ఏముందంటే.. మేము శ్రీవాణి టికెట్ మీద దర్శనానికి వచ్చాము. తిరుమలలో వసతి దర్శనం అన్నీ బాగా అయ్యాయి. దర్శనం తరువాత స్వామిని చూస్తూ వెనక్కు వస్తూ తన్మయత్వంతో అక్కడే నిలబడిపోయాము. ఆ సమయంలో అక్కడి సిబ్బంది మాతో గట్టిగా మాట్లాడారు. దాంతో మేం కొంత బాధపడి వాస్తవాలు టీటీడీలో ఉన్నతాధికారుల దృష్టికి వెళితే సమస్యలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడాము. దీన్ని కొందరు లేనివి ఉన్నట్లుగా వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ట్రోల్ చేయడం బాధాకరం. ఇప్పటికి మేము నాలుగు సార్లు శ్రీవాణి దర్శనానికి వచ్చాము. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మమ్మల్ని అడ్డుపెట్టుకుని టీటీడీ మీద బురద చల్లడం మాకు చాలా బాధ కలిగించింది.
Read Also…
Read Also…
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
తిరుమలలో నేడు శ్రీవారి దర్శనార్థం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణమవుతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి డిసెంబర్ 1వ తేది ఉదయం 7 గంటలకు ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకొని 8 గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు.
Read Also..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కొర్లగుంటకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు చెర్లోపల్లి విజయ రాయల్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వారితో పాటు అనేక మంది స్థానికులకు తిరుపతి ఎమ్మెల్యే మరియు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విజయమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాఅని, మీ అందరి చేరికతో ఈ ప్రాంతంలో మరింతగా సీఎం వైఎస్ జగనన్న నాయకత్వం బలపడుతుందన్న విశ్వాసం మాకు ఉందని అన్నారు. జగనన్న ఈ నాలుగున్నరేళ్లలో చేసినంత మేలు దేశంలో మరే ముఖ్యమంత్రి చేసి ఉండరు, చేయలేరు అన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.3.35 లక్షల కోట్లు జగనన్న జమ చేశారని, చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనలో కనీసం రూ.2,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేయ లేదని అన్నారు.
పేదలకు మంచి చేసే విషయంలో జగనన్నకు, చంద్రబాబుకు మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ గణాంకాలే నిదర్శనం అని, తిరుపతి అభివృద్ధికే జగనన్న రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తే.. చంద్రబాబు రూ.70 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని అన్నారు. జగనన్న అదనంగా తిరుపతిలోనే 26,400 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, పారిశుధ్య కార్మికులకు ఒకేసారి ఐదు వేల రూపాయలు పెంచామని గుర్తు చేసారు. కొర్లగుంట రోడ్డుతో సహా తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, లెక్కలేనన్ని ఫ్రీ లెఫ్ట్ రోడ్లు జగనన్న చొరవతోనే వేయడం జరిగిందని, గంగమ్మ గుడి వీధి ఏకంగా సమావేశాలు నిర్వహించుకునే విశాల మైదానంలా మారిపోయిందన్నారు. మనకు ఇంత మంచి చేస్తున్న జగనన్నకు మనం అండగా నిలవాలి భూమన కరుణాకరరెడ్డి కోరారు.
Read Also..




Total views : 91068