దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే అవకాశాలకు లోక్సభలో ఆమోదం లభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై బ్యాంకులు లేదా సేవలందించే సంస్థలు ఎలాంటి రుసుము వసూలు చేయలేవు. అయితే తాజా సవరణలతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిర్దిష్ట ఛార్జీలు వసూలు చేసే వీలు కల్పించే మార్గం సుగమమైంది. అయితే ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై మాత్రమే ఉండే మర్చంట్ డిస్కౌంట్ రేట్ రూపంలో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యూపీఐ సేవలను మరింత బలోపేతం చేయడం, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఈ ఆదాయాన్ని వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
Tag: