నీటి యుద్ధం (Water war) : త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కిన వెంకట నరసింహ పురం కాలనీ వాసులు…
నీటి యుద్ధం (Water war) : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ వెంకట నరసింహపురం కాలనీ వాసులు త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి నెలకొంది, గత 20 రోజుల నుండి కాలనీలో నీటి సమస్య ఉందని కేసరపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, మొక్కుబడిగా రోజుకు ఒక ట్రాక్టర్ ట్యాంకర్ పంపిస్తున్నారు ఇంటికి రెండు బకెట్లు నీళ్లు కూడా రావడం లేదు, మండుటెండలో నీళ్ల కోసం నాన్న ఇబ్బందులు పడుతున్నామని వెంకట నరసింహాపురం కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి కేసరపల్లి సర్పంచ్ కార్యదర్శి ఇప్పటికైనా తమ గోడు విని తమకు త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.
ఇది చదవండి : కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు
కాలనీ వాసులు మాట్లాడుతూ….
నిత్యవసరమైన నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో రాత్రి సమయంలో అరగంట మాత్రమే పంచాయతీ నీటి కుళాయిల ద్వారా ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా రావడం లేదు. పంచాయతీ నీళ్లు కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రలు మానుకుని ఎదురుచూపులు చూస్తున్నాము. మండుటెండల సైతం లెక్కచేయకుండా జనాలు నీళ్ల కోసం రోడ్ల వెంబడి తిరగవలసిన పరిస్థితి నెలకొంది. గత 20 రోజులుగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కి చెప్పిన నీటి సమస్య తీర్చకుండా నిర్లక్ష్య వైఖరి గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు 25 రూపాయలు చెల్లించి బయట నుంచి కొనుక్కుని దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాయకులు అధికారులు స్పందించి మా నీటి దాహార్తిని తీర్చాలని కేసరపల్లి శివారు వెంకట నరసింహ పురం కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి… - మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ… - అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మండుటెండలో నీటి యుద్ధం…






Total views : 62273