పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 కేజీల కేకును కట్ చేసారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ వేడుకకీ పలువురు వైఎస్ ఆర్సిపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
YS Jaganmohan Reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చింతపల్లి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభాప్రాంగణము, విద్యార్థులకు ట్యాబ్లులు పంపీణీ చెసె పాఠశాలను జిల్లా కలక్టరు సుమిత్ కుమార్, ఎమ్ ఎల్ ఎ భాగ్యలక్షి పరీశీలించి అధికారులుకు తగు సుాచనలు చేసారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది జనబా హాజకానున్నారని , ఈ రోజు విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. చౌడుపల్లిలో హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్, చింతపల్లిలో సభ స్థలం అధికారులు పూర్తి చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల రూపాయలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు.
100 మీటర్ల రోడ్డు వేయడం చేతకాని సీఎం పోలవరం ను కడతారా అని ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు అన్నారు. కాకుమాను మండలంలో పెదనందిపాడు నుండి బాపట్ల వెళ్లే రహదారిలో గల 100 మీటర్ల పొడవు కూడా లేని రోడ్డును బాగు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఇక్కడ రోడ్డును వెంటనే పున్నమించకపోతే జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, ప్రభుత్వానికి మూడు రోజులు గడువు ఇస్తున్నట్టు ఈ లోపు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహన చోదకులు అనునిత్యం ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలు అవటం జరుగుతుందని వెంటనే ఈ రహదారిని పునర్నిర్మించాలని లేనిచో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





Total views : 141674