Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ 

మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ 

by Satya
Bosta

మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల‌ రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల‌ రామయ్య అన్నారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీచర్ల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని తెలిపారు. సుమారు 65 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు చేశారని మండిపడ్డారు. 1600 నుంచి 2500 మంది టీచర్లు మంత్రి, పేషీ ఘనాపాటీలపై దాడికి సిద్ధంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
  • ఏపీ లిక్కర్‌ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.
    ఏపీ లిక్కర్‌ రవాణా కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కేసులో ముగ్గురు కీలక నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతినిచ్చింది హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు. వీరి విచారణ…
  • కడప జిల్లాలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన.
    కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలం, చిన్నకొమెర్ల సమీపంలో ప్రతిష్టాత్మక దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

040882
Total views : 212269

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: