తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించేవారికి ఆర్డినెన్స్‌తో చెక్ పెట్టారు. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆర్డినెన్స్‌కు కొనసాగింపుగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్, హైడ్రా పరిధిలో మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారాలను బదాలయించింది. దీంతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కులు, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి. ఫలితంగా ఇక నుంచి నోటీసులు జారీ చేయడం, మౌఖిక ఆదేశాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చేయడానికి, సీజ్ చేయడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో…
- సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212477