మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రగతి నగర్ లో ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెక్క సామగ్రి, సోఫాలు, పడకలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 15 నుండి 25 వరకు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కో దుకాణానికి సుమారు 20 నుండి 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. మొత్తం మీద కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.బాధిత వ్యాపారులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hyderabad
కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.”గీత గారు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది. దీన్ని నేను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను” అని రష్మిక పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత రష్మిక సీఎం కుటుంబాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు. 24 వేల 269 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీ నగర్-హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రెండోదశ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. ఆర్జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ , జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 ప్రాజెక్టుకు మొత్తం 19 వేల 579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఫేజ్ 2 ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రెండో దశ మెట్రో విస్తరణలో కిలో మీటరుకు నిర్మాణ అంచనా వ్యయం 318 కోట్లుగా ఉంది. పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఎలివేటెడ్ మెట్రో, డిజైన్, ఇన్నోవేషన్‌తో హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అనుమతులతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసమే 2 వేల 787 కోట్లు కేటాయించింది. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. తాజాగా ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది. మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామని పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్ ను రికవరీకి ప్రయత్నించామని, డేటా రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలోని FSL భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరగ్గా.. 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను పొందుపరిచి సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు నాగ్ పూర్ స్పెషల్ టీమ్ రిపోర్టులో తెలిపింది. దగ్ధమైన ఫైల్స్ లో ఒక కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా కాలి బూడిదైనట్లు తెలిపింది. దగ్ధమైన ఫైల్స్ లో ఏమేమి ఉన్నాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలోని మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో నాల్గవ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇన్ స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. స్టూడెంట్స్, ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. భవనం కింద అంతా వ్యాపార సముదాయాలు ఉండటం, బిల్డింగ్ అంతటా భారీ హోర్డింగ్స్ ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రమాద వశాత్తూ కిందపడినా గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ నెట్ ను పరిచారు. కోచింగ్ సెంటర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చే వీల్లేకపోవడంతో.. పెద్ద పెద్ద నిచ్చెనలతో బాల్కనీ నుంచి విద్యార్థులను కిందికి దించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు డిమాండ్ చేశారు. తమకు నిజంగా ఓటేశారా.. గుడికి వచ్చి నిరూపించుకోవాలనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు. డబ్బులు ఎవరు ఇవ్వమన్నారంటూ తిరగబడ్డారు. మేము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సదరు అభ్యర్థి భర్త గతంలో ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. డబ్బులు అడుగుతున్న వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఏపీలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వచ్చారు. ఈ నెల 21 వరకు సికింద్రబాద్‌లోని బొల్లారంలో ద్రౌపది ముర్ము ఉండనున్నారు. ఈనెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు నిర్మల లేఖ రాశారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు జల్పల్లిలోని తమ ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని తెలిపారు. అయితే ఈ విషయంలో విష్ణుపై మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు. మంచు విష్ణు తన పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ చేయలేదన్నారు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్లిపోయాడని లేఖలో తెలిపారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో, పెద్ద కుమారుడు అయిన విష్ణుకి సైతం అంతే హక్కు ఉందని స్పష్టం చేశారు. విష్ణు తన పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని, మనోజ్ ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదని విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు అని వెల్లడించారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మేమిక్కడ పని చేయలేమంటూ వాళ్లే మానేశారని, ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదని ఆ లేఖలో మంచు నిర్మల తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఈ విషయం లో అల్లుఅర్జున్ ఫై కేసు నమోదు అయి ఒకరోజు చంచల్ గూడా జైలు లోనే ఉన్నారు . అలుఅర్జున్ కి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు హై కోర్ట్ లో అప్పీల్ చేయడానికి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు . మధ్యంతర బెయిల్ తో బయటికి వచ్చిన అల్లుఅర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలి అని హై కోర్ట్ లో పిటిషన్ ను వేయనున్నట్లు సమాచారం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Total views : 194026