బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్టు రాకాడని, అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు. తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల అన్నారు.
Karimnagar
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట పెద్దపులి వాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి మండలం రాజారం నుండి కరీంనగర్ వెళ్తున్న కారు అదుపు తప్పు చెట్టును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజారంకు చెందిన భాస్కర్ , హబ్సిపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం , క్షతగాత్రులను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read Also..
Read Also..
ఈ రోజు మందమర్రి KK 5 బుగర్భ గని ఫై మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ మద్దతు గా AITUC జాతీయ కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య పాల్గొన్నారు సింగరేణి కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని, కాకా గారు సింగరేణి కార్మికుల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ సింగరేణి నిధులను దుర్వినియోగ పరుస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవ్వంపల్లి సమ్మయ్య, cpi జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు- 5 పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణం ఫైవింక్లైన్ ఏరియా చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారుల ఆట పాటలతో… టపాసులు మోతలతో ప్రాజెక్టు వరకు చేరుకున్నారు. ప్రాజెక్టులో ఉన్న కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న దుర్గమను దర్శించుకుని, అమ్మవారికి సమర్పించారు. అనంతరం మక్కాన్ సింగ్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుని ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.
Read Also..
టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 6850 రూపాయలు ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15.54 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి, గజ్వేల్ సహా 80 స్థానాలు గెలవడం ఖాయం అని జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్ లో సోమ వారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎకరానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అంటే బి ఆర్ ఎస్ నాయకులు మొత్తం మూడు గంటలే అని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని స్పష్టం చేశారు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..
ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయనికి 10ఎకరాల స్థలం కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైసరి కమిటీ వైస్ ఛైర్మన్ మెట్టు రాఘవేంద్ర అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వాయిసరి కమీటీ వైస్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి లకు మెట్టు. రాఘవేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హైద్రాబాద్ గోషామహల్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగా తెలంగాణ, కరీంనగర్ లో కేసీఆర్ ప్రకటించిన 10ఎకరాల భూమి లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి 20కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.అన్నివర్గాల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయం అని రాఘవేంద్రా పేర్కొన్నారు.
హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని, ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.





Total views : 196457