జగిత్యాల కొత్త బస్టాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ వద్ద బ్యాగ్ లో ఉన్న 15 తులాల బంగారు నగలు అపహరణకు గురైన ఘటన చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణంలో వెల్లుల్ల రోడ్ కి చెందిన కి చెందిన సురిగి మంగరాణి తన కూతురుతో బీర్పూర్ మం. లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో జగిత్యాల కొత్త బస్టాండ్ లో మెట్ పల్లి బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్ ఐ నరేష్ లు జగిత్యాల కొత్త బస్టాండ్ కు చేరుకుని బస్ స్టాండ్ లోని కంట్రోల్ రూమ్ లోని సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. అనంతరం బాధితురాలి నుండి ఫిర్యాదు స్వీకరించి జగిత్యాల టౌన్ సి ఐ వేణుగోపాల్ దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Karimnagar
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar)..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎంపీ పదవి ఏమైనా బండి సంజయ్ కి పునరావాస కేంద్రమా అని…రాజకీయాల్లో గెలుపోటములు సహజమని… ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) గారు అన్నారు. కరీంనగర్ 59 వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి-మహేష్ గారి నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు గార్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేసి ₹వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కరీంనగర్ లో ₹50 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.
బండి సంజయ్ కి ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రం..
కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ బడి తేలేదు…గుడి తేలేదని అన్నారు. కరీంనగర్ కు మంజూరైన ట్రిబుల్ ఐటీ బండి సంజయ్ అసమర్థత కారణంగా ఇతర రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరలించిందన్నారు. ఐదేళ్లలో ఊరు ముఖం చూడని బండి సంజయ్ కి ఇప్పుడు ప్రజలు గుర్తుకు వస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బండి సంజయ్ తెచ్చినట్లు ప్రగల్బాలు పలకడం భావ్యం కాదన్నారు.
కరీంనగర్ 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలతో సమావేశం..
కరీంనగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థి ని ప్రకటించలేదని.. బీజేపీ.. కాంగ్రెస్ మళ్ళీ ఒక్కటవుతున్నాయని అన్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లు ఈసారి ఎన్ని కుట్రలు చేసిన కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గా నేను ఘన విజయం సాధిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే మాధవి, మహేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసేవాడిని.. ప్రజా సమస్యలపై గళమెత్తే వాడిని నేనే..
ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలి..
బండి సంజయ్ ఐదేళ్లలో ఏం చేయలేదు..
బండి సంజయ్ కి ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా..
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కరీంనగర్ లో మళ్లీ కుమ్మక్కు కాబోతున్నాయి..
ఇది చదవండి : లైంగికదాడి బాధితురాలిని కోర్టు హాలులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
రోజు రోజుకీ సైబర్ నేరాలు (Cyber crime) విజృంభిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసి, నియంత్రించుటకు గాను రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా , తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మరియు కమీషనరేట్లయందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల (Cyber crime Police station)ను ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను కేటాయించగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామని , మంగళవారం నుండి పూర్తి స్థాయిలో (సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సేవలు అందుబాటులోకి వచ్చాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్.హెచో. ఓ. గా ఏసీపీ నర్సింహారెడ్డి ని నియమించామన్నారు. భాదితులు నేరుగా వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ , ఖాతాల్లో గల డబ్బు దోచుకుంటారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగత పాస్ వర్డ్ , ఓటీపీ లు అందించడం , ప్రలోభాలకు గురిచేసే లింక్ లను క్లిక్ చేయడం వంటి విషయాల్లో ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. సైబర్ క్రైమ్ గురైన భాదితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు. కమీషనరేట్ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సైబర్ నేరాలను పోలీస్ స్టేషన్ల వారీగా ఎక్కడికక్కడ అరికట్టి నియంత్రించేందుకు గాను సైబర్ వారియర్స్ టీం ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ కు టెక్నాలజీ పై అవగాహన వున్న సిబ్బందిని గుర్తించి వారిని సైబర్ వారియర్ గా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో భాదితులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకుగాను వీరిని ఏర్పాటు చేశామన్నారు. సైబర్ కేసుల్లో ఆధారాలు సేకరించి, నేరస్థులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుని భాదితులకు న్యాయం జరిగేలా చూడడం వీరి ముఖ్య విధిగా ఉంటుందన్నారు.
ఇది చదవండి: తీహార్ జైల్ ఎక్కడుందో తెలుసా..??
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో ‘రైతు దీక్ష’కు దిగారు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ, అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అంటూ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను కూడా అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. మోడీకి ఓటేయాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వద్ద నుండి అధికారులతో కలిసి గేట్లు ఎత్తి దిగువకు వరద కాలువ నుండి నీటిని విడుదల చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పొట్టా చివరి దశలో ఉన్న పంటపొలాలకు రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయడంతో పలు గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే సత్యం (MLA Sathyam) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. అన్నదాతలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ప్రతిపక్షాల నాయకుల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడుతామని గతంలో రైతులు నష్టపరిహారం అడిగితే రాళ్ల వాన పడి నష్టపోయాం అనుకోవాలని చెప్పిన మాజీ ఎమ్మెల్యేకు ధర్నా చేసే నైతిక హక్కు లేదని, గత ప్రభుత్వం హయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తే చొప్పదండి నియోజకవర్గం రైతులకు పరిహారం ఇప్పించని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వరద కాలువకు నీటిని విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది చదవండి: ప్రధాన అబ్దుల్ హమీద్ నివాసం పై రాకెట్ దాడి..!
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పెద్దపెల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన బాలింతలకు హాస్పిటల్ ఫుడ్ మేనేజ్మెంట్ గత వారం రోజుల నుండి ఉడకని గుడ్లు పాలు పాలలాగా కాకుండా నీళ్లలాగా ఇస్తున్నారని పేషెంట్స్ వాళ్ల కుటుంబీకులు చెప్తున్నారు. అదే విధంగా నిన్న ఈ రోజు ఉదయం ఉప్మా విషయంలో పేపర్లు అతికించే లైవ్ లాగా ఉందని, అది తిన్న చిన్నపిల్లలు వాంటింగ్ చేసుకున్నారని అన్నారు. మంథనిలో ఇంత మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా ఆవేదన చెందుతున్నామని అన్నారు. సదర్ కాంట్రాక్టర్ ను ఇదే మిటని అడిగితే నేను గత 11 నెలల నుండి పెడుతున్నానని ఇప్పటి వరకు నన్ను అడిగిన వాళ్లే లేరని చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో పేషంట్లకు మంచి ఫుడ్ ను అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు.
బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ (Gomase Srinivas)..
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బిజెపి గెలుపు ఖాయమైందని, దేశవ్యాప్తంగా బిజెపి గెలవబోతున్న 4 వందల స్థానాల్లో పెద్దపల్లి పేరు ఉండబోతుందని బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ (Gomase Srinivas) ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. అనంతరం అమర చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
పెద్దపల్లిలో బిజెపి గెలుపు ఖాయమైంది..
అనంతరం ఆయన మాట్లాడుతూ… మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే ముహూర్థం ఖరారయ్యిందన్నారు. పెద్దపల్లిని పాలించిన గత పాలకులు అర చేతిలో వైకుంఠం చూపించి అభివృద్దిని మరిచిపోయారని, ఇక్కడి ప్రజలను మోసం చేసి వివేక్ కుటుంబం పదవులు అనుభవించిందన్నారు. రూ. వందల కోట్ల సంపదను దోచుకుని, దోచుకున్న డబ్బులతో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్థరించుకున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్దిపై చిత్తశుద్ది లేదని, ఆరు గ్యారెంటీల అమలు చేయించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు.
దేశమంతా మోదీ హవా నడుస్తోంది..
చైనా, పాకిస్తానులను వణికించిన మోదీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశాన్ని చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తదితర దేశాలు భయపెట్టేవని, వారి ఒత్తిళ్ళకు తలొగ్గి కాంగ్రెస్ అధిష్టానం పని చేసేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయిన తరవాత శత్రుదేశాల భరతం పట్టడం జరిగిందని, ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలు మోదీ దెబ్బకు విలవిలలాడుతున్నాయని అన్నారు. మోదీ దార్శనికత వల్ల శత్రుదేశాలు మన వైపు కన్నెత్తి చూడటానికి గజగజ వణుకుతున్నాయని తెలిపారు. 5 వందల యేళ్ళుగా వివాదంలో ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి దేశ కీర్తిని మోదీ విశ్వవ్యాప్తం చేయడం గర్వంగా ఉందన్నారు. మోదీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులుగా అభివర్ణించిన ఆయన, తన చివరి శ్వాసవరకు దేశం కోసం,ధర్మం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులు..
పెద్దపల్లి పార్లమెంటులో బిజెపి గెలుపు ఖాయమైందని, గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రం చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం, మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ముస్లీముల ఖరస్తానుల అభివృద్దికి రూ. 20లక్షల ఎంపి నిధులు, సిఎస్ఆర్ నిధులతో విద్యాసంస్థల ఏర్పాటు, గోదావరి నీళ్ళను అదనపు పైపులైను ద్వారా పెద్దపల్లి రైతంగానికి సాగు నీరుగా అందించడానికి కృషి చేస్తానన్నారు.
నిజాయితీ గల పేదవాడికి, డబ్బు గల అవినీతి పరుడికి మధ్య యుద్ధం..
కాంగ్రెస్ అభ్యర్థి ఒక అముల్ బేబి బిజెపిలో ఉన్నంతకాలం కెసిఆర్ కుటుంబాన్ని వారసత్వ రాజకీయాలుగా విమర్శలు చేసిన వివేక్ వెంకటస్వామి, తన కొడుక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించడాన్ని ఎమంటారో తెలపాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిన గడ్డం వంశీ కృష్ణ ఒక అముల్ బేబీ అని ఎద్దేవా చేశారు. తండ్రి చాటు రాజకీయలతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాయితీ గల పేదవాడికి, డబ్బు గల అవినీతి పరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని పేర్కొన్నారు.తనకు అవకాశం ఇచ్చి ఎంపిగా గెలిపించాలని ఓటర్లను గోమాసే శ్రీనివాస్ కోరారు.
ఇది చదవండి : GHMC అడ్డగోలు రూల్స్, ఇబ్బందులు పడుతున్న సామాన్యులు..!
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్,జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పార్లమెంటు కన్వీనరు వెంకటేషం గౌడ్, కో కన్వీనరు గుండబోయిన లక్ష్మన్, నాయకులు శిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, దాడి సంతోష్, తాత రవి, గంగిపెల్లి స్వామి, రాజం మహంత, చిలారపు సంపత్, మేకల శ్రీనివాస్, గుడ్ల సతీష్, వివిధ మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా ఈ ధర్నాలో భాగంగా పట్టణ మరియు చుట్టుపక్క నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై మోడీ హటావో దేశ్ బచావో నినాదాలు చేశారు. మన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల వేల 18,23 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను విభాగం నోటీసు ఇవ్వడం వెనుక బిజెపి కుట్ర ఉందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కృంగదీయాలని బిజెపి ప్రయత్నిస్తుందని 2014లో రకరకాల వాగ్దానాలు చేసి బిజెపి ప్రభుత్వం లోకి వచ్చిందని తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని బిజెపికి ఈసారి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని ప్రజల సొమ్ముకు బిజెపి లెక్క చెప్పవలసి ఉంటుందని రానున్న రోజుల్లో బిజెపిని ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.
ఈ నెల ఒకటో తేదీన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గల జ్యోతిష్మతీ కళాశాల నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన ఎనగంటి అభిలాష్ (20) మృత దేహం లభ్యమైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఎనగంటి అభిలాష్ కళాశాల హాస్టల్ నుండి అదృశ్యమైనట్లు తండ్రి ఎనగంటి శ్రీనివాస్ ఈ నెల మూడో తేదీన ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తిమ్మాపూర్ పోలీసులు తెలిపారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు పలు కోణాల్లో ధర్యాప్తు చేపట్టగా.. ఈ రోజు మహాత్మనగర్ శివారులోని జ్యోతిభాపూలే పాఠశాల సమీపంలోని గవ్వ రవీంధర్ రెడ్డి వ్యవసాయ బావిలో అభిలాష్ మృత దేహమును పోలీసులు గుర్తించారు. బావిలో శవాన్ని బయటకు తీసి బట్టలను, సెల్ పోన్ ఆధారంగా అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్, బంధువులు గుర్తించినారు. అభిలాష్ మృతదేహానికి అక్కడే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా అభిలాష్ మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ఆ కోణంలో ధర్యాప్తు చేస్తున్నామని తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు…
వేలకోట్ల అధిపతిగా ఉన్న వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల నుండి వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తూ వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వేల కోట్లు ఉన్న వివేక్ కుటుంబానికి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ప్రోత్సహిస్తున్నాయి.
అందులో భాగంగానే వివేక్ కుటుంబానికి ఇద్దరు ఎమ్మెల్యే లు, ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విమర్శించారు. అందుకు వివేక్ రేవంత్ రెడ్డితో కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. వివేక్ కు చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానం నుండి పోటీ చేసి సత్తా చాటాలని సవాలు విసిరారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుందని విమర్శించారు. తాము ఎప్పటికీ బిజెపితో కలవమని చెప్పారు. బిజెపితో కలవలేదనే అక్కడితోనే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు.






Total views : 195655