రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫామస్పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. బిగ్బాస్ ఫేమ్, నటి హిమజ ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది. ఆమెతో సహా 11 మంది సినీ ప్రముఖులు, బిగ్బాస్ స్టార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Rangareddy
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ, కందుకూరు మండలం…..
కేఎల్ఆర్ కు కందుకూరు మండలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు కేఎల్ఆర్ కి మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో, కొత్తూరు, గపూర్ నగర్, కొత్తగూడా, జైత్వరం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి ,మురళి నగర్ ,పెద్దమ్మ తండా ,దావూద్ గూడా తండా ,బాచుపల్లి, నేదునూరు ,దాసర్లపల్లి ,గ్రామాలలో కేఎల్ఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఆర్ కి ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి కే ఎల్ ఆర్ కి ఘన స్వాగతం లభించింది కేఎల్ఆర్ కి అధిక మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు మాటఇవ్వడం జరిగింది మరియు నేదునూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నేతలతో పాటు 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా కందుకూరు మండలం మిర్ఖాన్పేట్ గ్రామం నుండి 500 మంది బిజెపి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
రాజేంద్రనగర్లో సన్సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో శనివారం వేకువజామున భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్జోన్కూ మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మరో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం నాలుగు దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also..
Read Also..
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 వ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, తన నివాసం నుండి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల బోనాల కోలాహలాల నడుమ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలం నుంచి గ్రామ గ్రామాన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని కళ్ళు కబుర్లు చెప్పే వారి మాటలు నమ్మకుండా న్యాయంగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని ప్రకాష్ గౌడ్ అన్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమేన భి భరత్ షాబాద్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలు ఏం అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే చేవెళ్లలో నాకు ఎలాంటి పోటీ లేదని చేవెళ్ల లో 60 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖల్లో చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి అవినాష్ రెడ్డి తోపాటు మిగతా కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కెసిఆర్ ఆయన పథకాలన్నీ నమ్మి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిందని నన్ను నమ్మి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్లోల్లా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధు జంతువు లాంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేర చరిత్రను చూసి మీరు ఓట్లు వేయాల్సిందిగా ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు త్రిబుల్ వన్ జీవోను అలాగే ఉంచాలని కోరుతున్నట్లు కానీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 111 జీవో ను తీసివేయాలని కోరుకుంటున్న అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..
Read Also..
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్ది అంజయ్య యాదవ్ షాద్ నగర్ రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే గా ఉన్న 9.5 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో షాద్ నగర్ ను ఎప్పుడు లేనంతగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. తెలంగాణ లో రైతులు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలని, అభివృద్ధి ని చూసి కేసీఆర్ ని నమ్ముతున్నారని మరోసారి తెలంగాణ లో BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ, కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి కాదు కదా ఎక్కడి నుంచి అయినా రండి. నవంబర్ 30 నాడు తెలంగాణ దమ్మెందో చూపిస్తాం. ఢిల్లీ దొరలకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. కాంగ్రెస్ కు గాని బీజేపీకి గాని తెలంగాణలో సత్తా ఉన్న నాయకులు లేరు. వాళ్లు బయటి రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో ఐటీ హబ్ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.




Total views : 81817