జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ గోదావరి నుండి తీసుకవచ్చిన నీళ్లతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు చప్పుళ్లు, సన్నాయి వాయిధ్యాల మధ్య గ్రామంలో ఊరేగించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహిస్తూ వేడుకున్నారు.అనంతరం గ్రామంలో ఉన్న 130 కి పైగా దేవాలయాల్లోని దేవతామూర్తులను గోదావరి నీటితో అభిషేకాలు చేస్తూ భక్తిశ్రద్ధలతో కొలిచారు. పిల్లలు, మహిళలు, పెద్దలు సమిష్టిగా గ్రామ మదేవతు లను పూజలు చేసి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహిస్తూ వేడుకున్నారు.గత 22 ఏళ్లుగా ప్రతి ఏటా పెద్దల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుందని, గోదావరి జలాలతో గ్రామదేవతలను అభిషేకం చేస్తే సంవత్సరం పాటు పాడిపంట, వర్షాలతో గ్రామం సుఖసంతోషంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.