Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం

తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం

by CVR NEWS

తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తాంతోణి సమీపంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీకి చెందిన బస్సు..నిన్న సాయంత్రం..కుళత్తూర్‌లోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఆ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం ధ్వంసం కావడంతో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిని కరూర్ ఎంపీ జ్యోతిమణి, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరులు పరామర్శించారు. దిండుక్కల్ జిల్లా కరికాళిలోని రాళ్ల క్వారీ నుంచి..పులియూర్‌లోని ప్రైవేటు సిమెంట్ కర్మాగారానికి కంకర లోడును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమేంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యముందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023308
Total views : 141740

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.