నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని నిర్వహిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ముసలి కన్నీరు కార్చిందని, నిరుద్యోగులకు చేయూత నిస్తామని నేడు మొండి చేయి ఇచ్చిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. గత పది ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని, అందుకే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు గడిచిన నిరుద్యోగుల ఏ ఒక్క సమస్యలను పరిష్కరించలేదని, నిరుద్యోగులకు ప్రతినెల అందిస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేకపోయిందన్నారు. లోగడ రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..ప్రధానంగాగ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గల మెత్తిన బీజేవైఎం నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించడం అమానుషమని, దీన్ని బీజేవైఎం జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ..టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్‌లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194211