Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.

by CVR NEWS

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్‌ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్ ప్రకటించింది. ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రయోగాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ క్షిపణి ప్రయోగ తర్వాత జపాన్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. జపాన్ ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్‌లో ఒక అధికారిక పోస్ట్‌ను ప్రచురించింది. ‘నార్త్‌ కొరియా జపాన్ జలాల్లోకి అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీనిపై మరింత సమాచారం అందిస్తాం’ అని పోస్ట్‌లో తెలిపింది. అయితే క్షిపణి ప్రయోగంపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపిన అనంతరం ఆ క్షిపణులు జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జలాల అవతల పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిసైల్స్ ప్రయోగం ఆందోళన కలిగిస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

023216
Total views : 141537

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.