Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home TelanganaKhammam ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన

ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన

by Rama
lakshman

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్‌ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. రాజాసింగ్‌ సస్పెన్షన్‌, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: