రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ, కందుకూరు మండలం…..
కేఎల్ఆర్ కు కందుకూరు మండలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు కేఎల్ఆర్ కి మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో, కొత్తూరు, గపూర్ నగర్, కొత్తగూడా, జైత్వరం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి ,మురళి నగర్ ,పెద్దమ్మ తండా ,దావూద్ గూడా తండా ,బాచుపల్లి, నేదునూరు ,దాసర్లపల్లి ,గ్రామాలలో కేఎల్ఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఆర్ కి ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి కే ఎల్ ఆర్ కి ఘన స్వాగతం లభించింది కేఎల్ఆర్ కి అధిక మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు మాటఇవ్వడం జరిగింది మరియు నేదునూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నేతలతో పాటు 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా కందుకూరు మండలం మిర్ఖాన్పేట్ గ్రామం నుండి 500 మంది బిజెపి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది