Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News త్వరలో మీ ముందుకు వస్తాను….

త్వరలో మీ ముందుకు వస్తాను….

by Prakash
KCR's emotional message to fans

సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌.. కేటీఆర్‌ నినాదాలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆసుపత్రి బయట పరిస్థితులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్‌ఎస్‌ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన విజ్ఞప్తి చేశారు. తాను కోలుకుంటున్నానని.. త్వరలో మీ ముందుకు వస్తానని. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తనతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు సహకరించాలని..తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్లు బీఆర్‌ఎస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90559

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.