Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

by Prakash
District Collector Siktha Patnaik

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15వ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్లతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. క్రీడల్లో సమిష్టిగా సాగుతూ దానితో పాటు చదువుల్లోనూ క్రమశిక్షణ తో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్‌ స్పిరిట్‌, సాంఘిక బాధ్యత తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్‌, క్రీడలు బోధనలో తప్పనిసరి కావాలని టీచర్ లకు సూచించారు. విద్యార్థులు క్రీడల్లో చక్కని ప్రదర్శన చేసారు అని, కేంద్రియ విద్యాలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: