Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్

by Satya
suffocating Israel

ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. ఈ ఘటనలు ఆ దేశానికి మింగుడు పడనివే. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలను తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్ధతు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరోచోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: