వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం చాకిబండ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల బయారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దిరేవుల కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎపి ఫైబర్ ఎం డి మధుసూదన్ రెడ్డి దంపతులతో పాటు మాజీ జడ్పిటిసి సభ్యులు మద్దిరేవుల శ్రీనివాసులు రెడ్డి దంపతులు స్వామి వారికీ కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు చాకిబండ గ్రామాల ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కుడా భారీగా తరలి వచ్చారు. కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అనంతరం ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటి సభ్యులు ఏర్పాట్లు చేశారు. దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మద్దిరేవుల బయారెడ్డి కుటుంబ సభ్యుల అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చాకిబండ గ్రామా ప్రజల సహకారంతో ఎంతో పురాతనమైన ఆలయం ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించే విధంగా ఆలయాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజల సహకారంతో చాకిబండ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. గ్రామస్తులు ఎల్లమ్మ దేవాలయాన్ని కుడా అభివృద్ది చేయాలనీ తమను కోరారు అని ప్రజల సహకారంతో ఆ అమ్మవారి గుడిని కుడా నిర్మించేందుకు శ్రీకారం చుడతామన్నారు. ప్రజల ఎల్లా వేళల అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కరించడమే కాకుండా పురాతన ఆలయాలను అభివృద్ధి పరుస్తూ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు ఆహార్నిషులు కృషి చేస్తున్న మద్దిరేవుల బయారెడ్డి కుటుంబానికి చాకిబండ గ్రామా ప్రజలు అండదండలు ఉంటాయన్నారు .
కన్నుల విందుగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం…
74
previous post