Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Devotional శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం

by Satya
Sri Varasiddhi Vinayakaswamy

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం చరిత్ర
పూర్వం మూగ, గుడ్డి, చెవిటి అన్నదమ్ములకు కలిసి ఒక కాణి మడి ఉన్నది. వారు ఆ మడిని బావినీటి సరఫరాతో వ్యవసాయం చేసేవారు. ఒకసారి తీవ్రమన కరువు కారణంగా బావి ఎండిపోవడంతో వారు బావిని మరికొంత లోతు త్రవ్వుతున్న సనయంలో గునపానికి ఒకారాయి తగిలి అందులో నుండి రక్తం పైకి ఎగజిమ్మ అన్నదమ్ముల మిద పడగానే వారి అవకర్యాలు పోయి వారు ముగ్గురూ స్వస్థులైయ్యారు. వారు ఆనందంగా ఈ విషయం ఊరి వారికి తెలియజేయగా అనదరూ కలిసి అక్కడ వినాయకుని విగ్రహం ఉన్నదని తెఉసుకుని దావినిని బయటకు తీసి అక్కడ ఆలయనిర్మాణం చేసి ఆరాధనలు ప్రారంభించారు. కాణి మడిలో లభించిన వినాయకుడు కనుక ఈ క్షేత్రం కాణిపాకంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో అసత్యం పలికితే వినాయకుడు దండనకు గురిఔతారని విశ్వసించబడుతుంది. అందువలన ఇక్కడ భక్తులు అసత్యం చెప్పరు.
వరసిద్ధి వినాయకుడు
శాసనాధారాల ప్రకారం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించాడు. ఆ తరువాత దాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరించారని తెలుస్తున్నది.కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడ వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్ధం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
విశేషాలు
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధంకారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయ స్థానాలలో కూడ ప్రామాణికంగా తీసుకునె వారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.