Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న – రేవంత్‌రెడ్డి

నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న – రేవంత్‌రెడ్డి

by Satya
Revanth Reddy

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. సంకెళ్లు తెంచి స్వేచ్ఛ ను పంచి జనం ఆకాంక్షలను నిజంచేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతి ఇచ్చిందని పేర్కొన్నారు. పేదల గొంతుకు వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014201
Total views : 79544

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.