Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News నాకు అవకాశమిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా…

నాకు అవకాశమిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా…

by Prakash
Attend distribution program and distribute kites to children

బోయిన్పల్లి లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. బారాస నాయకుడు టింకూ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగురవేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సీటు విషయంలో అధిష్టానం తనకు అవకాశమిస్తే బరిలో ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ నాయకులతో కలిసి గోవా టూర్ ఎంజాయ్ చేసామన్నారు. గోవా టూర్ లో భాగంగా సముద్రంలో రకరకాల విన్యాసాలు చేయడం మంచి అనుభూతి కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ధ్యానం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: