Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం సిద్ధం…

అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం సిద్ధం…

by Prakash
Srivari prasadam

అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌హప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిర ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందుకోసం గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. ఈ ల‌డ్డూల‌ను అయోధ్య‌కు పంప‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శివ‌ప్ర‌సాద్‌తో పాటు ఏఈవో శ్రీ‌నివాసులు త‌దిత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039390
Total views : 196621

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: