Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ప్రకాశ్‌గౌడ్‌

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ప్రకాశ్‌గౌడ్‌

by Satya
CM Revanth Reddy and Prakash Goud

రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భూసమస్యలు పరిష్కరించాలని, నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్టు చెప్పారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014237
Total views : 79599

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.