Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKarnool రసాభాసగా సాగిన కౌన్సిల్ సమావేశం..

రసాభాసగా సాగిన కౌన్సిల్ సమావేశం..

by Rama
Council meeting

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధి పై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా, టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి జరగలేదు అనడం పై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా మున్సిపల్ చెర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశంను ముగించి వెళ్ళిపోయాడు. ఎన్నో సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడాలని కౌన్సిల్ హల్ కు వస్తే ఇలా మాట్లాడకుండా వైసీపీ కౌన్సిలర్ లు అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం మెట్లపై టీడీపీ నాయకులు బైటయించి నిరసన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశాల్లో టీడీపీ కౌన్సిలర్ లు మాట్లాడే అవకాశం కలిపించాలని వారు డిమాండ్ చేసారు.

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78684

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.